జబర్దస్త్ కామెడీ షోతో పాటు ఇతర షోల ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న కమెడియన్లలో హైపర్ ఆది ఒకరు.మెగా ఫ్యామిలీకి వీరాభిమాని అయిన హైపర్ ఆది( Hyper aadi ) భోళా శంకర్ సినిమాలో కీలక పాత్రలో నటించారు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైపర్ ఆది చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.హైపర్ ఆది కామెంట్స్ పై సోషల్ మీడియాలో ప్రముఖ పార్టీ నేతలు ట్రోల్స్ చేస్తున్నారు.
చిరంజీవి గత 30 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నాడని చిరంజీవి సినీ సైనికులను తయారు చేస్తుండగా పవన్ జన సైనికులను తయారు చేసి జనసేనాని అయ్యారని ఆయన పేర్కొన్నారు.చిరంజీవికి హీరోలే అభిమానులుగా ఉంటారని తనపై విమర్శలు వస్తే సినిమాలతోనే చిరంజీవి జవాబు ఇస్తాడని హైపర్ ఆది చెప్పుకొచ్చారు.
చిరంజీవి ఎదగక ముందు ఎదిగిన తర్వాత ఆయనకు అవమానాలు జరిగాయని ఆది తెలిపారు.

చిరంజీవి( Chiranjeevi ) మాత్రం తనపై వచ్చిన విమర్శలను పట్టించుకోకుండా ముందడుగులు వేశారని ఆది చెప్పుకొచ్చారు.రియల్ లైఫ్ లో చిరంజీవి అందరినీ క్షమిస్తాడని ఆది కామెంట్లు చేశారు.తనపై తప్పుడు వార్తలు రాసేవారిని సైతం చిరంజీవి క్షమించారని చిరంజీవి కొడుకు చిరంజీవిని మించి పేరు సంపాదించారని హైపర్ ఆది వెల్లడించారు.
చిరంజీవి మంచోడు కాబట్టి ముంచేశారని పవన్ మాత్రం మొండోడని ఆది పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తాడో పేడో తేల్చుకుంటాడని ఆది చెప్పుకొచ్చారు.భోళా శంకర్ అద్భుతంగా ఉంటుందని భోళా శంకర్ కలెక్షన్లు చెప్పడానికి మంత్రి ఉన్నాడంటూ అంబటి గురించి ఆది ఎద్దేవా చేశారు.బ్రో మూవీ కలెక్షన్లు తక్కువగా వచ్చాయని మంత్రి చెబుతున్నాడని ఆయన అక్రమ కలెక్షన్లతో పోలిస్తే మన కలెక్షన్లు తక్కువగా ఉంటాయని ఆది వెల్లడించారు.
ఆది విమర్శలపై వైసీపీ నేతలు ఎవరైనా రియాక్ట్ అవుతారేమో చూడాలి.