ప్రజా యుద్ధనౌక కు చివరి నివాళి !

బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి దొడ్డి దారిన జారుకుంటున్న నైజాము సర్కరోడి ( Nizam Sarkarodi )నిరంకుశత్వాన్ని నిలబెట్టి నిలదీసిన నువ్వు చెప్పా పెట్టకుండా కన్నీట మమ్ముంచి ఏ బండి లో పోతివో జాడ లేకపోతివి.పొద్దును ముద్దాడే పొద్దు తిరుగుడు పువ్వు ఎదురుచూసే సూర్యకాంతిని విప్లవ కిరణాలు గా మా గుండెల్లో కి ప్రసరింపచేసిన నువ్వు నీవు కోరిన వెలుగు తెలంగాణ( Telangana ) బతుకుల్లో రాకముందే చీకటిలోకి నడిస్తివి.

 Tribute To Gaddar, Gaddar, Nizam Sarkar , Telangana, Red Flags, Telangana Folk-TeluguStop.com

దండకారణ్య ఖనిజ సంపద ను సొంతం చేసుకునే అధికార వర్గాలు అదే అడవి బిడ్డలను అంటరానివారిని చేస్తుంటే ఆ అడవితల్లికి వందనమిస్తూ అణగారిన వర్గాలకు అందలమిస్తూ నువ్వు చేసిన గానం మా గుండెను వీడకముందే ఘాడ నిశబ్ధం లోనికి పోతివి.

Telugu Gaddar, Nizam Sarkar, Red Flags, Telangana, Telangana Folk, Tribute Gadda

సిరిమల్లె చెట్టు కింద చినబోయి కూర్చున్న లచ్చుమమ్మ పేరిట( Lachumamma ) ఆది దేవతల సరసన నిలవాల్సిన ఆడపడుచుల అష్టకష్టాలు కళ్ళకు కట్టినట్లు చెప్తానే వాళ్ళ పాదం మీద పుట్టు మచ్చవై వారి పురోగతికి నువ్వేసిన మెట్ల దారిలో నిన్ను వెతకగా కానరాకుంటివి.కొమ్రన్న కొడుకుకి భద్రం చెప్తూ సగటు పల్లెటూరి యువకుడికి పట్నం మీదుగా ప్రపంచాన్ని జయించే బాధలన్నీ పోయేటి బాట ఒకటి ఉన్నదంటూ నువ్వు కోరుకున్న దారి ఎదురుగుండగనే ఎగురుకపోతివి.

Telugu Gaddar, Nizam Sarkar, Red Flags, Telangana, Telangana Folk, Tribute Gadda

నీ ఒంటిని మీటిన తూటాలకు కూడా యుధ్ధపు సిరానంటించి రెట్టింపు వేగంతో వెనక్కి పంపినా ,బయటకు పోనన్న ఆ ఒక్క తూటాను కన్న మట్టినంటిపెట్టుకున్న తీరుగా పొదివి దాచుకున్నా చెదరని నీ ఉక్కు సంకల్పం నేడు ఏ గాలి తూటాకు బుడులిచ్చేందుకు నిన్ను కనుమరుగు చేసిందో చెప్పకపోతివి.నడుస్తున్న కాలానికి పొడుస్తున్న పొద్దుకి పారే నీటికి జారే కన్నీటికి కూడా విప్లవ భావజాలాన్నందించిన నువ్వు నేడు ఆ పోరాట ప్రతీకలైన ఎర్ర జెండాలు ఎర్ర తివాచీల రూపం దాల్చుతుంటే తీరం చేరకుండానే ప్రజా యుద్ధనౌక ఆయువు చాలించితివి ఏది ఏమైనప్పటికీ నువ్వు వెలిగించింది తెలంగాణ కీర్తి మాత్రమే కాదు…ప్రతి బతుకు తాలూకా నిత్య నూతన విప్లవ స్ఫూర్తి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube