డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘బ్రో’.( Bro Movie ) ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) ఇద్దరు కీలక పాత్రలో నటించారు.
అంతేకాకుండా కేతిక శర్మ, ప్రియా ప్రకాష్, సముద్రఖని, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్ తదితరులు నటించారు.ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి విశ్వ ప్రసాద్, వివేక్ కూఛిభోట్ల నిర్మించారు.ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించాడు.సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టాడు.
ఇక ఈ సినిమా తమిళం లో విడుదలైన వినోదయ సిత్తం అనే సినిమాను రీమేక్ చేయగా ఈ సినిమా ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో రూపొందింది.ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.ఇక ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం.
కథ:
కథ విషయానికి వస్తే.సాయి ధరమ్ తేజ్ మార్కండేయ అలియాస్ మార్క్ గా( Markandeya ) చాలా స్వార్థపరుడుగా కనిపిస్తాడు.తన అవసరాలు తప్ప ఇతరుల గురించి అస్సలు ఆలోచించడు.తన సొంత ఫ్యామిలీని కూడా అస్సలు పట్టించుకోడు.అలాంటి మార్క్ కు ఒక ప్రమాదం జరగడంతో అక్కడికక్కడే మరణిస్తాడు.
అదే సమయంలో గాడ్ ఆఫ్ టైం (పవన్ కళ్యాణ్) వస్తాడు.ఇక ఆయన చనిపోయిన మార్క్ కి మరో అవకాశం ఇస్తాడు.
అలా మార్క్ కు తన జీవితంలో గాడ్ ఆఫ్ టైం వచ్చాక ఏం జరిగింది.చివరికి అసలేం జరుగుతుంది అనేది మిగిలిన కథలోనిది.
![Telugu Brahmanandam, Bro, Bro Story, Bro Review, Bro Avatar, Ketika Sharma, Pawa Telugu Brahmanandam, Bro, Bro Story, Bro Review, Bro Avatar, Ketika Sharma, Pawa](https://telugustop.com/wp-content/uploads/2023/07/pawan-kalyan-saidharam-tej-bro-movie-review-and-rating-detailssa.jpg)
నటినటుల నటన:
నటి నటుల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఎనర్జీ ఎప్పటిలాగానే హైగానే ఉంది.ముఖ్యంగా ఆయన స్టైల్, డైలాగ్ చెప్పే విధానం కిక్కు తెప్పించే విధంగా ఉన్నాయి.ఇక సాయిధరమ్ తేజ్ కూడా అద్భుతంగా నటించాడు.కేతిక శర్మ,( Ketika Sharma ) ప్రియా ప్రకాష్( Priya Prakash ) కూడా బాగానే పర్ఫామెన్స్ చేశారు.మిగతా నటీనటులంతా తమ పాత్రపు తగ్గట్టు పర్ఫామెన్స్ చేశారు.
టెక్నికల్:
టెక్నికల్ విషయానికి వస్తే.డైరెక్టర్ సముద్ర ఖని( Director Samudrakhani ) ఆల్రెడీ ప్రేక్షకులకు తెలిసిన కథనే చూపించాడు.అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ తో కథకు హైప్ క్రియేట్ చేశాడు.
సినిమాటోగ్రఫీ బాగుంది కానీ ప్రొడక్షన్స్ విలువలు చాలా వీక్ గా అనిపించాయి.ముఖ్యంగా తమన్ అందించిన పాటలు అందగా ఆకట్టుకోలేకపోయాయి.
ఎడిటింగ్, స్క్రీన్ ప్లే అంతంత గానే కనిపించాయి.
![Telugu Brahmanandam, Bro, Bro Story, Bro Review, Bro Avatar, Ketika Sharma, Pawa Telugu Brahmanandam, Bro, Bro Story, Bro Review, Bro Avatar, Ketika Sharma, Pawa](https://telugustop.com/wp-content/uploads/2023/07/pawan-kalyan-saidharam-tej-bro-movie-review-and-rating-detailss.jpg)
విశ్లేషణ:
ఇక ఈ సినిమా కథ ఆల్రెడీ తెలిసిన కథనే అయినప్పటికీ కూడా కొంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చూపించాడు డైరెక్టర్.ఇక కొన్ని సన్నివేశాలు, సాంగ్స్ కాస్త డీసెంట్గా అనిపించాయి తప్ప అంతా కనెక్ట్ కాలేకపోయాయి.ఇక క్లైమాక్స్ ఎమోషనల్ మాత్రం బాగా ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మాత్రం ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.
![Telugu Brahmanandam, Bro, Bro Story, Bro Review, Bro Avatar, Ketika Sharma, Pawa Telugu Brahmanandam, Bro, Bro Story, Bro Review, Bro Avatar, Ketika Sharma, Pawa](https://telugustop.com/wp-content/uploads/2023/07/pawan-kalyan-saidharam-tej-bro-movie-review-and-rating-detailsd.jpg)
ప్లస్ పాయింట్స్:
పవన్ కళ్యాణ్ పర్ఫామెన్స్, డైలాగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఫస్ట్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్, క్లైమాక్స్.
మైనస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్ సాగదీసినట్లు అనిపించింది.పాటలపై మరింత శ్రద్ధ పెడితే బాగుండేది.
వి ఎఫ్ ఎక్స్ వర్క్.కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కనెక్ట్ కాలేవు.
బాటమ్ లైన్:
చివరిగా చెప్పాల్సిందేంటంటే ఈ సినిమా ఫ్యాన్స్ కి ఖచ్చితంగా చెప్పాలి.ఇక మిగతా ఆడియన్స్ కి మాత్రం ఓపిక అవసరమని చెప్పవచ్చు.