జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విజయవాడలో ని కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.రెండో విడత వారాహి యాత్రలో భాగంగా వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలుస్తోంది.
ఈ మేరకు 228 సచివాలయంలో పని చేస్తున్న అయోధ్యనగర్ కు చెందిన దిగమంటి సురేశ్ బాబు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.సురేశ్ బాబు ఫిర్యాదుతో పవన్ కల్యాణ్ పై 153, 153ఏ, 505(2) ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.