హర్యానాలోని( Haryana ) పంచ్కూలా జిల్లాలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.నదికి సమీపంలో ఉన్న ఒక గుడిలో పూజలు చేద్దామని వచ్చిన ఒక మహిళను మృత్యువు వెంటాడింది.
సమయానికి స్థానికులు కాపాడటంతో ఆమె ప్రాణాలతో బతికి బయటపడగలిగింది.
వివరాల్లోకి వెళ్తే.
గత కొద్ది రోజులుగా నైరుతి రుతుపవనాల వల్ల హర్యానా అంతటా కుండపోత వర్షాలు( Rains ) కురుస్తున్నాయి.మరీ ముఖ్యంగా రెండు రోజులుగా వర్షాలు భారీగా పడుతున్నాయి.
దీనివల్ల వాగులు, వంకలు, నదులు భారీ వరద నీటితో ఉప్పొంగుతున్నాయి.అయితే ఆదివారం నాడు పంచ్కూలా జిల్లాలోని ఖరక్ మంగోలి ఊరు సమీపంలో ఉన్న నదిలో నీటిమట్టం ప్రమాదకరస్థాయిలో పెరిగింది.
సరిగ్గా ఆ సమయంలోనే నదికి సమీపంలో పూజలు నిర్వహించేందుకు ఒక మహిళ తన తల్లితో సహా కారులో అక్కడికి వచ్చింది.నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న నది ఒడ్డునే ఆమె కారు పార్క్ చేసింది.
మరుక్షణమే ఆ కారును వరదలు ( Floods ) చుట్టుముట్టాయి.ఇది గమనించిన తల్లి కారు దిగిపోయింది కానీ ఆ మహిళ మాత్రం అందులోనే చిక్కుకుపోయింది.క్షణాల్లోనే వరద నీరు ఆ ప్రాంతాన్ని ఐదారు అడుగుల మేర ముంచేసింది.దాంతో కారు వరదలో కొట్టుకుపోయే అంచున నిలిచింది.దీన్ని గమనించిన స్థానికులు క్షణాల్లోనే స్పందించారు దగ్గర్లోనే ఉన్న వంతెనకు తాడు కట్టి ఆ తాడు సహాయంతో వరద నీటిలోకి వారి దిగారు అనంతరం కార్ కి తాడు కట్టి దానిని కింద పడిపోకుండా చేశారు.ఆపై అతి కష్టం మీద మహిళను బయటకు తీసుకు రాగలిగారు.
అప్పటికే ఆ మహిళా స్పృహ తప్పింది.దాంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం ప్రాణాపాయం తప్పిన ఆమెకు డాక్టర్లు చికిత్స చేస్తున్నారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది ఈ వీడియో చూసిన నెటిజెన్లు స్థానికులకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
ఎందుకంటే స్థానికులే లేకపోతే ఈరోజు ఆమె విగతజీవిగా మారి ఉండేది.అలాగే ఆ మహిళ యముడికి జస్ట్ హాయ్ చెప్పి వచ్చినట్లు ఉంది అని కొందరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.