చాయ్ బిస్కెట్ వారి నిర్మాణంలో సుమంత్ ప్రభాస్( Sumanth Prabhas ) హీరోగా అతనే డైరెక్ట్ చేస్తూ వచ్చిన సినిమా మేమ్ ఫేమస్( Mem Famous ) రీసెంట్ గా రిలీజై సూపర్ హిట్ అందుకున్న ఈ సినిమా నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టింది.థియేట్రికల్ తోనే లాభాలు తెచ్చుకున్న ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ తో మరింత ప్రాఫిట్స్ తెచ్చేలా ఉంది.
ఇక ఇదే జోష్ తో మేమ్ ఫేమస్ సినిమా టీం మరో ప్రాజెక్ట్ త్వరలో ఎనౌన్స్ చేయబోతుందని తెలుస్తుంది.అంతా సెట్ అయితే మేమ్ ఫేమస్ 2( Mem Famous 2 ) ఉంటుందని టాక్.
సుమంత్ ప్రభాస్ ఇప్పటికే దీనికి సంబంధించిన స్టోరీ సిద్ధం చేసే పనిలో ఉన్నాడట.
మేమ్ ఫేమస్ 2 అదే కథను కొనసాగిస్తారా లేదా వేరే నేపథ్యం తీసుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది.ఏది ఏమైనా ఒక చిన్న ప్రయత్నాన్ని ఆడియన్స్ మెచ్చుకోగా అది వారికి ఎంతో ప్రోత్సాహకరంగా అనిపించింది.దాంతో వారు మళ్లీ అలాంటి ప్రయత్నాన్నే చేయాలని ఫిక్స్ అయ్యారు.
చాయ్ బిస్కెట్ నిర్మాతలు రీసెంట్ గా ఔత్సాహిక దర్శకులకు, రైటర్స్ కు మంచి కథ ఉంటే తమని కాంటాక్ట్ చేయండని ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చారు.