ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనపై మరో రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.హైదరాబాద్ నగరంలో మోదీ రోడ్ షో లేదా బహిరంగ సభ ఉంటుందని పేర్కొన్నారు.
అదేవిధంగా తెలంగాణలో ఈనెల 15న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఈనెల 25న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటిస్తారని కిషన్ రెడ్డి వెల్లడించారు.కాగా ప్రధాని తొమ్మిదేళ్ల పాలన పూర్తయిన సందర్భంతో పాటు ఏపీ, తెలంగాణలో అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో బీజేపీ ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా బీజేపీ అగ్రనేతలు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.