ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్( Elon Musk ) ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత అందులో కీలక మార్పులను చేస్తున్నారు.ముఖ్యంగా బ్లూటిక్ వెరిఫికేషన్ మార్క్( Bluetic Verification Mark )ను పెయిడ్ ఫీచర్ గా మార్చారు.
డబ్బులు చెల్లించని వారందరికీ ఈ వెరిఫికేషన్ మార్క్ ఈ మధ్య తొలగించారు.అయితే ఇప్పుడు మళ్లీ దానిని ఒక మిలియన్ ఫాలోవర్లు ఉన్న అన్ని అకౌంట్స్‌కి ఇవ్వడం మొదలుపెట్టారు.
పది లక్షల ఫాలోవర్స్ ఉన్న అకౌంట్స్ వెరిఫికేషన్ ప్రాసెస్ ద్వారా వెళ్లకపోయినా లేదా 8 డాలర్ల ప్రీమియం సర్వీస్‌కి సబ్‌స్క్రైబ్ ( Subscribe to Premium Service )చేసుకోకపోయినా ఈ బ్లూటిక్ మార్కును ప్రస్తుతం ట్విట్టర్ ఆఫర్ చేస్తోంది.
అవి మీమ్స్ ఖాతాలా లేక అధికారుల ఖాతాలా అనేది ఏం చూడకుండా ట్విట్టర్ ఎవరికి పడితే వారికి ఈ వెరిఫికేషన్ మార్కును ఫ్రీగా ఇస్తోంది.దాంతో ఈ మార్కుకు ఉన్న వ్యాల్యూ పోయింది.అంతేకాదు, ట్విట్టర్ లో ఉన్న ఒక గ్లిచ్ వల్ల సుశాంత్ సింగ్ రాజ్‌పుత్( Sushant Singh Rajput ) వంటి చనిపోయిన సెలబ్రిటీల అకౌంట్లకు కూడా చెక్ మార్క్ వచ్చింది.
చనిపోయిన వారి అకౌంట్స్ నుంచి ఎలా వెరిఫికేషన్ చేస్తారు, వారికి బ్లూ టిక్ మార్క్ ఎలా ఇస్తారు అనేది తెలియక ట్విట్టర్ యూజర్లు షాక్ అవుతున్నారు.
మొత్తం మీద ఇదంతా కావాలనే ట్విట్టర్ చేస్తోందా లేక సాంకేతిక లోపం కారణంగా జరిగిందా అనేది తెలియ రాలేదు.ఏది ఏమైనా ప్రముఖ సెలబ్రిటీల అకౌంట్ల నుంచి ఒకసారి బ్లూటిక్ మార్క్ తీసేయడం మరోసారి విలియం ఫాలోవర్లో ఉన్న ఖాతాలకు ఫ్రీగా వెరిఫికేషన్ ఇవ్వడం ఇప్పుడు గందరగోళానికి దారి తీసింది.చాలామంది యూజర్లు విమర్శలు కూడా చేస్తున్నారు.