టాలీవుడ్ ఇండస్ట్రీ( Tollywood Industry )లో తన టాలెంట్ తో అభిమానులకు దగ్గరైన హీరోయిన్లలో అనుపమ ఒకరనే సంగతి తెలిసిందే.ఎక్కువగా సెకండ్ హీరోయిన్ రోల్స్ లో నటించిన ఈ బ్యూటీ స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాన్ని మాత్రం సొంతం చేసుకోలేకపోయారనే సంగతి తెలిసిందే.
అయితే ప్రస్తుతం చిన్న పాత్రలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న ఈ బ్యూటీ తాజాగా షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.

ఎవరేం అనుకుంటారో అనే భయంతో కొన్ని మంచి పాత్రలను వదులుకున్నానని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.తెలుగులో టిల్లు స్క్వేర్ సినిమా( Tillu Square )తో తమిళంలో ఒక ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్న ఈ బ్యూటీ రెండేళ్ల క్రితం వరకు పాత్రల ఎంపికకు సంబంధించి తాను గందరగోళ స్థితిని ఎదుర్కొన్నానని ఆమె తెలిపారు. ఫ్రీడమ్ @ మిడ్ నైట్( Freedom @ Midnight ) అనే షార్ట్ ఫిల్మ్ లో నేను నటించగా ఆ షార్ట్ ఫిల్మ్ ను అందరూ ఆదరించారని అనుపమ చెప్పుకొచ్చారు.
ఆ షార్ట్ ఫిల్మ్ నాలో ధైర్యం నింపడంతో పాటు నాలో నాలోని అపోహలను, భయాలను పోగొట్టిందని ఆమె కామెంట్లు చేశారు.కొన్ని రోల్స్ చేస్తే ఆడియన్స్, ఫ్యాన్స్ ఏ విధంగా ఫీల్ అవుతారో అని నేను అనుకున్నానని ఆ భయమే నేను చాలా రోల్స్ ను వదులుకోవడానికి కారణమైందని ఆమె కామెంట్లు చేశారు.
ఇప్పుడు మాత్రం మనం చేసే రోల్ నచ్చితే ఆడియన్స్ ఆదరిస్తారని అనిపిస్తోందని అనుపమ పేర్కొన్నారు.

ఇకపై ప్రతి సినిమాలో కొత్త పాత్రలో నటించాలని నేను అనుకుంటున్నానని ఆమె కామెంట్లు చేశారు.నాకు నచ్చిన రోల్స్ చేయాలని నేను భావిస్తున్నానని ఆమె కామెంట్లు చేశారు.ఇతర భాషలలో సైతం సినిమాలు చేసి ఆడియన్స్ కు మరింత దగ్గర కావాలని నేను అనుకుంటున్నానని అనుపమ పరమేశ్వరన్( Anupama Parammeswaran ) వెల్లడించారు.