నిత్యం సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు అప్లోడ్ అవుతూ ఉంటాయి.అయితే అందులో ఏ కొన్నో వైరల్ అవుతూ ఉంటాయి.
అందులో విశేషతే వాటిని వైరల్ అయ్యేలా చేస్తుంది.కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని చాలా చమత్కారంగా ఉంటాయి.
కొన్ని ఆశ్చర్యంగా ఉంటే, మరికొన్ని మనసుకి హత్తుకునేవిగా ఉంటాయి.తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం గమనించవచ్చు.
విషయం ఏమంటే, శివరాత్రి సందర్భంగా తమిళనాడులోని ఆదియోగి శివ విగ్రహాన్ని ఓ ఇద్దరు దంపతులు సందర్శించారు.ఈ సందర్భంగా వారు అక్కడ పరిసరాలను ఆస్వాదిస్తూ మధ్యమధ్యలో ఫోటోలు కూడా తీసుకున్నారు.
ఈ క్రమంలో ఆదియోగి బాక్గ్రౌండ్లో తన భార్య ఫోటోని పర్ఫెక్ట్‌గా తీసేందుకు పెద్దాయన ప్రయత్నించడం మనకు స్పష్టంగా కనిపిస్తుంది.ఈ వీడియోను యోగ విత్ కుష్ ఇన్‌స్టాగ్రాం ఖాతాలో షేర్ చేయగా ఆ వీడియో కాస్త వైరల్ అవుతోంది.
కాగా సదరు వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 90 లక్షలమంది చూశారంటే ఆ వీడియో ఎంత కూల్ గా వుందో అర్ధం చేసుకోవచ్చు.కాగా ఆదియోగి శివ విగ్రహాన్ని సందర్శించిన వృద్ధ దంపతుల ఆనందాన్ని సదరు వీడియోలో స్పష్టంగా చూడవచ్చు.భర్త కోరిన విధంగా ఆమె నవ్వుతూ పోజులు ఇవ్వడం ఇక్కడ గమనించవచ్చు.ఇకపోతే సదరు దంపతుల అన్యోన్య బంధంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇది స్వచ్ఛమైన ప్రేమని కొంతమంది యూజర్లు కామెంట్ చేస్తే, ఇది ట్రూలవ్ అంటూ మరికొంతమంది యూజర్లు కామెంట్ చేయడం ఇక్కడ చూడవచ్చు.