ప్రస్తుతం తెలుగు తమిళ్ అనే తేడా లేకుండా స్టోరీ నచ్చితే చాలు ఏ డైరెక్టర్ తో ఏ హీరో అయిన సినిమా చేసే విధంగా గా తయారైంది పరిస్థితి… రీసెంట్ గా ధనుష్ హీరో గా తెలుగు డైరెక్టర్ అయిన వెంకీ అట్లూరి తో సార్ అనే సినిమా తీసి హిట్ కొట్టాడు, అలాగే శివ కార్తికేయన్ తో అనుదిప్ కూడా ప్రిన్స్ సినిమా తీసి హిట్ కొట్టాడు, వంశీ పైడిపల్లి వారసుడు అనే సినిమా తీసి తమిళ్ లో హిట్ అందుకున్నాడు ఇలా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది డైరెక్టర్లు వేరే భాష లో హీరోలతో సినిమాలు చేసి సక్సెస్ లు అందుకోవడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది అందుకే ప్రభాస్ లాంటి స్టార్ హీరో కూడా కన్నడ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు… అయితే ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట ఏంటంటే జూనియర్ ఎన్టీయార్ వెట్రిమారాన్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు అనే న్యూస్ తెగ వైరల్ అయింది.
వెట్రిమారన్ సినిమాలు చాలా రియల్ ఎస్టిక్ గా ఉంటాయి అందుకే ఎన్టీయార్ ఆయనతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది.ఇక ఇది ఇలా ఉంటే వెట్రిమారన్ ధనుష్ తో చేసిన సినిమాలు అన్నీ మంచి విజయాలను అందుకున్నాయి ముఖ్యం గా అసురన్ సినిమా అయితే సూపర్ హిట్ అయింది అది తెలుగులో నారప్ప గా వెంకటేష్ రీమేక్ చేశాడు తెలుగులో యావరేజ్ గా ఆడింది…
అయితే ఎన్టీయార్ ప్రస్తుతం ఉన్న కమిట్ మెంట్లు పూర్తి చేశాక వెట్రిమారాన్ తో సినిమా చేస్తాడని తెలుస్తుంది ఈ న్యూస్ కనక నిజమైతే ఎన్టీయార్ వెట్రిమారన్ సినిమా ఎన్టీయార్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి వెట్రి మారన్ సినిమాల్లో చేస్తే ఎన్టీయార్ కి బెస్ట్ యాక్టర్ గా చాలా అవార్డ్స్ వస్తాయి ఎందుకంటే ఎన్టీయార్ యాక్టింగ్ చేయడంలో దిట్ట ఇక వెట్రిమారన్ సినిమాలు అంటే హీరో యాక్టింగ్ వేరే లెవల్లో ఉంటుందని అటు సినిమా అభిమానుల నుంచి ఇటు ఎన్టీయార్ ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.చూడాలి మరి వీళ్ళ కాంబోలో సినిమా ఎప్పుడు వస్తుందో…