బీఆర్ఎస్, బీజేపీలపై తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ప్రజాస్వామ్యానికి బీఆర్ఎస్, బీజేపీలు ప్రమాదకరమని తెలిపారు.
బీజేపీ ప్రభుత్వం మత ప్రాతిపదికన దేశాన్ని విడదీస్తుందని భట్టి ఆరోపించారు.కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కోట్లు తిన్నారు కానీ చుక్క నీరు పారించలేదని తెలిపారు.
ప్రాజెక్టుకు కాల్వలు తవ్వకుండా నీళ్లు ఎట్ల ఇస్తారని ప్రశ్నించారు.బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కొత్త ప్రాజెక్టును కట్టలేదని విమర్శించారు.
కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులతోనే ఇప్పుడు 24 గంటల కరెంట్ సాధ్యమైందని పేర్కొన్నారు.కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ భూముల రేట్లు పెంచేలా చేస్తే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అమ్మేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.







