వర్షాకాలం( rainy season ) రానే వచ్చింది.జూన్ నెల ప్రారంభం నుంచే వర్షాలు మెల్లమెల్లగా ఊపందుకున్నాయి.
వర్షాకాలాన్ని వ్యాధుల కాలం అని కూడా పిలుస్తుంటారు.ఎందుకంటే వర్షాకాలం లో అధిక తేమ కారణంగా వాతావరణంలో బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది.
అలాగే జలుబు, ఫ్లూ, దగ్గు, విష జ్వరాల వ్యాప్తి ఈ సీజన్ లోనే అత్యధికంగా ఉంటుంది.అందుకే వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతున్నారు.
ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా జబ్బుల బారిన పడతారని హెచ్చరిస్తున్నారు.అయితే ఈ సీజన్ లో మన ఆరోగ్యానికి అండగా నిలిచే కొన్ని పండ్లు ఉన్నాయి.
వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అల్ల నేరేడు.వర్షాకాలంలో తప్పకుండా తీసుకోవాల్సిన పండు.ఇండియన్ బ్లాక్ బెర్రీ( Indian black berry ) అని పిలవబడే అల్ల నేరేడు పండ్లు ఈ వర్షాకాలంలో మన ఆరోగ్యానికి అండగా నిలుస్తాయి.
అల్ల నేరేడు లో ఉండే విటమిన్ సి, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీ సిస్టమ్( Antioxidants immune system ) ను సూపర్ స్ట్రాంగ్ గా మారుస్తాయి.దీంతో వర్షాకాలంలో వచ్చే అనేక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.
అల్ల నేరేడు పండ్లను తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ సైతం కంట్రోల్ లో ఉంటాయి.అలాగే వర్షాకాలంలో తప్పకుండా తీసుకోవాల్సిన పండ్లలో దానిమ్మ( Pomegranate ) ఒకటి.
సాధారణంగా ఈ సీజన్ లో డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాల వ్యాప్తి చాలా అధికంగా ఉంటుంది.వీటికి అడ్డుకట్ట వేయడానికి దానిమ్మ సహాయపడుతుంది.అలాగే రక్తహీనత బారిన పడకుండా కాపాడుతుంది.
ఈ వర్షాకాలంలో రోజుకు ఒక ఆరెంజ్( Orange) పండును తప్పకుండా తీసుకోవచ్చు.ఆరెంజ్ పండు తీసుకుంటే రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
గుండె ఆరోగ్యంగా మారుతుంది.సీజనల్ వ్యాధులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.
చర్మం నిగారింపుగా మెరుస్తుంది.ఇక ఈ వర్షాకాలంలో మన ఆరోగ్యానికి చెర్రీ పండ్లు( Cherry fruits ) కూడా ఎంతో మేలు చేస్తాయి.
ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ ఏ, విటమిన్ బీ, పొటాషియం వంటివి ఉండటం వల్ల.ఇమ్యునిటీ సిస్టం స్ట్రాంగ్ గా మారుతుంది.
దాంతో వర్షాకాలంలో వేధించే అనేక వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.అలాగే చెర్రీ పండ్లు ఆరోగ్యపరంగా మరెన్నో ప్రయోజనాలను సైతం చేకూరుస్తాయి.
కాబట్టి ఈ సీజన్ లో తప్పకుండా పైన చెప్పిన నాలుగు పండ్లను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.