స్టార్ హీరోల సినిమాలలో నటిస్తున్న శ్రీ లీల... మరీ తన ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా?

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి పెళ్లి సందD ( Pelli SandaD ) అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి శ్రీ లీల(Sreeleela) .మొదటి సినిమాతో ఈమె పెద్దగా ప్రేక్షకులను మెప్పించ లేకపోయినా తదుపరి చిత్రం ధమాకా( Dhamaka ) తో మాత్రం పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంది.

 Heroine Sreeleela Favorite Hero Suriya,hero Suriya,sreeleela,sreeleela Movies,pa-TeluguStop.com

అద్భుతమైన డాన్స్ ఎనర్జీ లెవెల్స్ మాత్రమే కాకుండా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో శ్రీ లీల ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇలా తన నటనతో అందరిని ఫిదా చేసిన ఈమెకు చిత్ర పరిశ్రమలో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.

దాదాపు ఆరేడు సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు.

Telugu Dhamaka, Suriya, Kollywood, Mahesh Babu, Pawan Kalyan, Sreeleela-Movie

బాలకృష్ణ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ పోతినేని, వైష్ణవ్ తేజ్ వంటి పలువురు హీరోల సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి శ్రీలకు మరి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇష్టమైనటువంటి హీరో ఎవరు అనే సందేహం అందరిలో నెలకొంది.అయితే తనకు ఇండస్ట్రీలో ఫేవరెట్ హీరో ( Sreeleela Favourite Hero ) ఎవరు అనే విషయం గురించి గతంలో ఈమె ఓ సందర్భంలో మాట్లాడుతూ తన అభిమాన హీరో ఎవరో చెప్పేశారు.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సినిమాలలో నటిస్తున్నటువంటి శ్రీ లీలకు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య( Suriya ) అంటే విపరీతమైన అభిమానమని వెల్లడించారు.


Telugu Dhamaka, Suriya, Kollywood, Mahesh Babu, Pawan Kalyan, Sreeleela-Movie

ఇలా కోలీవుడ్ హీరో సూర్యతో కలిసి తాను ఒక సినిమాలో నటించిన చాలు అని ఈమె ఆశాభావం వ్యక్తం చేశారు.ఇంతమంది తెలుగు హీరోలతో పని చేస్తున్నటువంటి శ్రీ లీలకు కోలీవుడ్ హీరో సూర్య అంటే ఎందుకంత ఇష్టం అనే విషయానికి వస్తే ఆయన యాక్టింగ్ స్కిల్స్ తనకు నచ్చడమే కాకుండా ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేయడం శ్రీ లీలను ఆకట్టుకుంది.దీంతో ఆయనని తన అభిమాన హీరోగా అభిమానిస్తూ ఉంటారని తెలుస్తుంది.మరి తన ఫేవరెట్ హీరోతో కలిసిన నటించే అవకాశం శ్రీ లీలకు రావాలని అభిమానులు కూడా ఆకాంక్షిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube