ఏపీ బిజెపి అధ్యక్షుడిగా పనిచేసిన సీనియర్ పొలిటిషన్ కన్నా లక్ష్మీనారాయణ బిజెపికి రాజీనామా చేసి నిన్ననే టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరిపోయారు.రాజకీయంగా చంద్రబాబు మంచి ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో పాటు, సత్తెనపల్లి నియోజకవర్గ టికెట్ హామీ లభించడంతో కన్నా భారీగా అనుచరులతో టిడిపి కండువా కప్పుకున్నారు.
సుదీర్ఘకాలం నుంచి రాజకీయాల్లో ఉండడం , మంత్రి పదవులు చేపట్టడం, కాపు సామాజిక వర్గంలోనూ ఆయనకు మంచి గుర్తింపు ఉండడం, ఇవన్నీ లెక్కలు వేసుకునే టిడిపి ‘కన్నా’ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అయితే కన్నా లక్ష్మీనారాయణ బిజెపిని వీడి టిడిపిలో చేరే సమయంలో బిజెపిలో ఉన్న ఆయన అనుచరులను వెంట తీసుకువెళ్లినా, బిజెపి నుంచి పెద్దగా స్పందన అయితే కనిపించలేదు.
మామూలుగా అయితే పెద్ద ఎత్తున టిడిపి పైన, కన్నా లక్ష్మీనారాయణ పైన విమర్శలు చేసే అవకాశం ఉన్నా, బిజెపి నేతలు మౌనంగానే ఉండిపోయారు.చాలాకాలంగా ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తో కన్నా లక్ష్మీనారాయణ కి వైరం ఉంది ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నా. ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకునేవారు.ఈ క్రమంలోనే బిజెపిలో ఉన్న తన రాజకీయ భవిష్యత్తు అంతంత మాత్రమే అన్నట్టుగా ఉంటుందనే అభిప్రాయానికి వచ్చిన కన్నా టిడిపిలో చేరిపోయారు.
ఆయన చేరిక సమయంలో ఆయనతో పాటు , ఆయన కుమారుడు నాగరాజు , నాగభూషణం, అడపా నాగేంద్ర వంటి కీలక నేతలు టిడిపి లో చేరిపోయారు.కన్న తనతో పాటు భారీ స్థాయిలో అనుచరులను తెలుగుదేశం లోకి తీసుకువెళ్లినా బీజేపీ నుంచి స్పందన కనిపించలేదు.
ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు మంత్రిగా పనిచేసిన కన్నా, బిజెపిని వీడడం, ఆ పార్టీకి తీరని నష్టమే అయినా … ఆయన పార్టీ వీడకుండా బిజెపి ప్రయత్నాలు చేయలేదు.
కనీసం ఆయన పై ఎవరు విమర్శలు చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.ఎప్పటి నుంచో టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకుంటాయనే ప్రచారం జరిగినా ప్రస్తుత పరిస్థితుల్లో బిజెపి టిడిపి కలిసే అవకాశం లేదు.ఇదే విషయాన్ని బిజెపి అగ్ర నాయకులు అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు ఇవన్నీ లెక్కలు వేసుకునే బిజెపి ని వీడి టిడిపిలో చేరారు.
అయితే ఆయనపై ఈ సమయంలో విమర్శలు చేయడం వల్ల కన్నా లక్ష్మీనారాయణ ప్రాధాన్యం పెంచినట్లు అవుతుందని లెక్కలు వేసుకునే బిజెపి వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లు అర్థమవుతుంది.