బాలీవుడ్ స్టార్ హీరోల్లో బాద్షా షారుఖ్ ఖాన్ ఒకరు.ఈయన ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను చేసి ఈ స్థాయికి చేరుకున్నాడు.
షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా అదిరిపోయే హిట్ అందించాడు.
ఈ సినిమా ఏకంగా 800 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి సంచలనం క్రియేట్ చేసింది.
ఇక ఈ సినిమా తర్వార్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న సినిమా ‘జవాన్‘.
ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి.
షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.నయనతార మొదటి సారి బాలీవుడ్ సినిమా చేస్తుంది.
ఈ సినిమాతో ఈమె బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది.
ఇక ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుండి ఏదొక ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అవుతూనే ఉంది.మరి కొద్దీ రోజుల క్రితం ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి కూడా గెస్ట్ రోల్ లో నటిస్తున్నాడు అంటూ కోలీవుడ్ మీడియాలో భాగా ప్రచారం జరిగింది.ఈ సెన్సేషనల్ కాంబో బయటకు రాగానే అంతటా ఈ సినిమా పేరు మారుమోగి పోయింది.
అయితే విజయ్ ఈ సినిమాలో ఉన్నాడో లేదో అని క్లారిటీ లేదు.
అయితే మళ్ళీ గత కొన్ని రోజుల నుండి ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.ఈ ఊహించని రూమర్స్ లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.అయితే ఈ వార్తలపై తాజాగా లంజ క్లారిటీ అయితే తెలుస్తుంది.
అట్లీ ఈ సినిమాలో ఉన్న రోల్ కోసం ముందుగా విజయ్ ను సంప్రదించారట.ఆ తర్వాత ఐకాన్ స్టార్ దగ్గరికి వచ్చినట్టు టాక్.
ఇలా విజయ్ స్థానంలో ఐకాన్ స్టార్ వచ్చారు.ఇదే నిజం అయితే అల్లు అర్జున్ స్టార్ డమ్ తో నార్త్ లో కూడా ఈ మూవీ క్రేజ్ పెరగడం ఖాయం.