రవి బాబు దర్శకత్వం లో వచ్చిన అవును సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ పూర్ణ.ఈమె హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి బుల్లి తెర పై మరియు వెండి తెర పై తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది.
ఈ ముద్దుగుమ్మ ఇటీవలే పెళ్లి చేసుకుంది, పెళ్లి చేసుకున్న పూర్ణ కొన్నాళ్ల పాటు బుల్లి తెర మరియు వెండి తెర పై సందడి చేసింది.తాజాగా సోషల్ మీడియా లో ఈ అమ్మడు యొక్క శ్రీమంతం ఫోటోలు వైరల్ అయ్యాయి.
త్వరలోనే తల్లి కాబోతున్న పూర్ణ ఇక సినిమా ఇండస్ట్రీ కి దూరం అయినట్లే అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.కానీ పూర్ణ సన్నిహితులు మాత్రం ఆమె మళ్ళీ బుల్లి తెర మరియు వెండి తెర పై సందడి చేయడం ఖాయం అంటూ బలంగా వాదిస్తున్నారు.
![Telugu Dhee Dance Show, Poorna, Ravi Babu-Movie Telugu Dhee Dance Show, Poorna, Ravi Babu-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/02/heroine-poorna-green-signal-to-movies-after-her-deliveryc.jpg )
విదేశాల్లో భర్త ఉంటున్నా కూడా ఆమె సినిమా పరిశ్రమ పై ఉన్న ఆసక్తి ని తగ్గించుకోదని, తప్పకుండా ముందు ముందు మరిన్ని సినిమాలు చేస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆమె అంటే అభిమానం ఏర్పడింది.అంతే కాకుండా ఆమె పై ఉన్న ఆసక్తి తో దర్శక నిర్మాతలు ఆమె కి ప్రత్యేకంగా పాత్రలు క్రియేట్ చేస్తున్నారు.సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేసేందుకు ఓకే చెప్తే ముందు ముందు వరుసగా ఆఫర్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
మరి పూర్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో ఎలాంటి పాత్రలు చేయబోతుందో చూడాలి.ఢీ షో తో మంచి పాపులారీటిని సొంతం చేసుకున్న పూర్ణ బుల్లి తెరపై మరిన్ని ఆఫర్లు దక్కించుకుంటూ ఉందట.
త్వరలో తల్లి కాబోతున్న పూర్ణ వచ్చే ఏడాది లో మళ్లీ ఢీ షో లో పాల్గొంటాను అంటూ సన్నిహితులతో చెప్పిందట.