యూఎస్ఎలో రెండేళ్లకు ఒక్కసారి నాట్స్ (నార్త్ అమెరికా తెలుగు సొసైటీ) అమెరికా తెలుగు సంబరాలు జరుగుతాయి.అయితే ఈసారి ఈ సంబరాల కోసం తాజాగా ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కాగా దీనికి విశేష స్పందన లభించింది.ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమం సందర్భంగా సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీధర్ అప్పసాని మాట్లాడుతూ నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు ఈ సారి చాలా ప్రత్యేకంగా జరగనున్నాయని పేర్కొన్నారు.
న్యూ జెర్సీ, ఎడిసన్‌లోని మొఘుల్ బాల్రూమ్లో ఈ ఈవెంట్‌ను కండక్ట్ చేశారు.
![Telugu Aruna Ganti, Nats, Jersey, America Telugu, Americatelugu, Nri, Nrisridhar Telugu Aruna Ganti, Nats, Jersey, America Telugu, Americatelugu, Nri, Nrisridhar](https://telugustop.com/wp-content/uploads/2023/02/huge-response-for-nats-fund-raising-in-new-jersey-detailsa.jpg)
శ్రీధర్ అప్పసాని మాట్లాడుతూ ఇంకా మాట్లాడుతూ ఈసారి లోకల్ ఆర్టిస్టుల పర్ఫామెన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు.అలానే మహిళలకు సంబంధించి అనేక కార్యక్రమాలు ఉంటాయని నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి అన్నారు.నాట్స్ తెలుగమ్మాయి కార్యక్రమం మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని ఆమె తెలిపారు.
అంతేకాకుండా, పేరెంట్స్ మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ కూడా చేపడతామని శ్రీధర్ చెప్పి ఆశ్చర్యపరిచారు.ఈ కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులను గౌరవించవచ్చని ఆయన వివరించారు.
![Telugu Aruna Ganti, Nats, Jersey, America Telugu, Americatelugu, Nri, Nrisridhar Telugu Aruna Ganti, Nats, Jersey, America Telugu, Americatelugu, Nri, Nrisridhar](https://telugustop.com/wp-content/uploads/2023/02/huge-response-for-nats-fund-raising-in-new-jersey-detailsd.jpg)
నాట్స్‌కి ఫండ్స్ అందించడం అంటే అది కేవలం సంబరాల కోసం మాత్రమే కాదని అది ఒక గొప్ప ఆశయం కోసం, ఆపదలో ఉన్న సాటి మనిషికి చేయూత అందించడం కోసమని శ్రీధర్ అప్పసాని తెలిపారు.ఇకపోతే సంబరాల కమిటీలో ఫండ్ రైజింగ్ కోసం రాజ్ అల్లాడ, కళ్యాణ్ లక్కింశెట్టి, వంశీ కొప్పురావూరి తమ వంతు కృషి చేస్తున్నారు.అందుకుగాను వీరిని శ్రీధర్ ప్రత్యేకంగా అభినందించారు.ఇదిలా ఉండగా నాట్స్ విరాళాల ద్వారా గతంలో కష్టాల్లో ఉన్న ఎంతోమందికి హెల్ప్ చేయడం సాధ్యమైంది.ముఖ్యంగా నాట్స్ కరోనా బాధితులకు అండగా నిలిచింది.