కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం చెలరేగింది.వేంపల్లి బొందల బ్రిడ్జ్ వద్ద పెద్దపులి సంచారిస్తున్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న వాహనదారులు పులి సంచరిస్తుండగా వీడియో తీశారు.దీంతో స్థానికులతో పాటు ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
అనంతరం గ్రామస్థుల సమచారంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు పెద్దపులి పాదముద్రలను గుర్తించారు.ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.