ప్రముఖ టాలీవుడ్ నటులలో రవివర్మ ఒకరు కాగా ఒక ఇంటర్వ్యూలో రవివర్మ మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక విషయాలను పంచుకున్నారు.నేను చేసిన నెగిటివ్ రోల్స్ ఏ స్థాయిలో పాపులర్ చేశాయో నన్ను అంటే లిమిట్ చేశాయని నాకు అనిపిస్తుందని రవివర్మ అన్నారు.
రాఖీ సినిమాలో నటించడం వల్ల ప్రతి ఒక్కరూ నన్ను సులువుగా గుర్తు పడతారని రవివర్మ కామెంట్లు చేశారు.
పదేళ్ల తర్వాత కూడా నన్ను గుర్తు పడతారంటే ఆ సినిమానే కారణమని రవివర్మ తెలిపారు.
కృష్ణవంశీ గారు పది రకాలుగా చేయమని అడిగేవారని ఆయన చెప్పుకొచ్చారు.కథ, కథనంకు ఏది బాగుంటుందని ఆయన ఆలోచిస్తారని రవివర్మ అన్నారు.కృష్ణవంశీ నుంచి నేను పది వేరియేషన్స్ ఇస్తే అన్నీ గుర్తు పెట్టుకోవాలని తెలుసుకున్నానని ఆయన తెలిపారు.నేను చేసిన పది నెగిటివ్ రోల్స్ మంచి రోల్స్ అయ్యాయని రవివర్మ అన్నారు.
![Telugu Ravivarma, Krishna Vamsi, Kshanam, Nakshatram, Salary, Tollywood-Movie Telugu Ravivarma, Krishna Vamsi, Kshanam, Nakshatram, Salary, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/02/actor-ravivarma-krishna-vamsi-salary-social-media.jpg)
రాఖీ చేసిన తర్వాత ఐదేళ్లు నేను సినిమాల్లో లేనని ఆయన తెలిపారు.నక్షత్రం సినిమా సమయంలో నేను కృష్ణవంశీ గారిని కలిశానని రవివర్మ అన్నారు.రంగమార్తాండ సినిమాలో పాత్రలు లేవని రవివర్మ చెప్పుకొచ్చారుఅమెరికాకువెళ్లకుండా ఉండి ఉంటే కెరీర్ మరోలా ఉండేదని ఆయన కామెంట్లు చేశారు 2015లో శ్రీమంతుడు అసుర, 2016లో క్షణం, టెర్రర్జయమ్ము నిశ్చయమ్మురా మంచి పేరు తెచ్చిపెట్టాయని రవివర్మ పేర్కొన్నారు.
![Telugu Ravivarma, Krishna Vamsi, Kshanam, Nakshatram, Salary, Tollywood-Movie Telugu Ravivarma, Krishna Vamsi, Kshanam, Nakshatram, Salary, Tollywood-Movie]( https://telugustop.com/wp-content/uploads/2023/02/actor-ravivarma-Kshanam-movie-nakshatram-movie-krishna-vamsi.jpg)
గరుడవేగ, నెపోలియన్, ట్యాక్సీవాలా, సాహో సినిమాలు మంచి పేరును తెచ్చిపెట్టాయని ఆయన కామెంట్లు చేశారు.నేను యూఎస్ సిటిజన్ అని రవివర్మ తెలిపారు.వాల్యూకామ్, రీడిఫ్ లలో నేను పని చేశానని రవివర్మ చెప్పుకొచ్చారు.
లక్షల్లో వేతనం వచ్చేదని ఆయన తెలిపారు.అయితే ఫ్యామిలీ సపోర్ట్ చేయడంతో సినిమాల్లో కెరీర్ ను కొనసాగిస్తున్నానని రవివర్మ వెల్లడించారు.
ఎవరు చెప్పినా సలహాలు వింటానని రవివర్మ పేర్కొన్నారు.