ప్రముఖ టాలీవుడ్ బ్యానర్లలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఏడాది వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో విజయాలను సొంతం చేసుకోగా అమిగోస్ సినిమాతో కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ భావించినా ఆ విధంగా జరగడం లేదు.అమిగోస్ మూవి తొలిరోజు 2.5 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోగా రెండో రోజు నుంచి ఆ కలెక్షన్లు మరింత తగ్గాయి.ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సైతం ఎన్టీఆర్ అమిగోస్ గురించి మరీ పాజిటివ్ గా స్పందించలేదు.
అమిగోస్ మూవీ ఫలితం తారక్ కు ముందే తెలుసని అందువల్లే తారక్ ఈ విధంగా వ్యవహరించారని కామెంట్లు వినిపిస్తున్నాయి.టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం కూడా అమిగోస్ పాలిట శాపమైందని ఈ రీజన్ వల్లే ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో చూడటం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
వాస్తవానికి అమిగోస్ టైటిల్ ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు.అమిగోస్ అంటే ఫ్రెండ్స్ అని అర్థం చెప్పినా సినిమా కథకు ఆ టైటిల్ కు సంబంధం లేదు.
సాధారణంగా హీరో మూడు పాత్రలలో కనిపిస్తే ప్రేక్షకులను సైతం కన్ఫ్యూజ్ చేయవచ్చు.అయితే స్ట్రెయిట్ నారేషన్ తో దర్శకుడు రాజేంద్ర రెడ్డి ప్రేక్షకులను నిరాశపరిచారు.సినిమాలోని కొన్ని సన్నివేశాలు లాజిక్ కు దూరంగా ఉండటం కూడా మూవీకి మైనస్ అయింది.మైత్రీ నిర్మాతలు సైతం ఈ సినిమాకు మరీ భారీ స్థాయిలో పబ్లిసిటీ అయితే చేయలేదు.15 కోట్ల రూపాయల రేంజ్ లో ఈ సినిమాకు బిజినెస్ జరగగా ఈ సినిమా ఆ మార్కును అందుకోవడం సులువు కాదు.
అమిగోస్ రిజల్ట్ ముందే తెలియడంతో ఈ సినిమాను చూసినా తారక్ ఎక్కడా ఆ విషయాన్ని రివీల్ చేయలేదని బోగట్టా.కళ్యాణ్ రామ్ కొత్తగా ట్రై చేసినా మైఖేల్ పాత్ర ఆకట్టుకున్న స్థాయిలో సిద్దార్థ్, మంజునాథ్ పాత్రలు ఆకట్టుకోలేదు.బింబిసార తొలిరోజే ఏడు కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధించగా ఈ సినిమా ఆ కలెక్షన్లలో సగం కూడా సాధించలేదు.
కళ్యాణ్ రామ్ కథల ఎంపికలో, దర్శకుల ఎంపికలో పొరపాట్లు చేస్తున్నాడని ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది.