ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటిస్తున్నారు.ఈ సందర్బంగా అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని సందర్శించి ఆయనకు నివాళులర్పించారు.
అల్లూరి విగ్రహం ప్రధాని మోడీ ఆవిష్కరించడం నా మనసుకి ఎంతో సంతోషం కలిగించిందని ఆయన తెలిపారు.
యువత భీమవరం వచ్చి అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని సందర్శించాలని సూచించారు.
అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర పాఠ్యాంశాలలో భాగంగా ఉండాలన్నారు.ప్రభుత్వాలు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరారు.