హృతిక్ రోషన్ పై చేసిన కామెంట్స్ గురించి స్పందించిన రాజమౌళి.. కించపరచడం నా ఉద్దేశం కాదు అంటూ?

టాలీవుడ్ దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.ఇప్పటికీ ఈ సినిమా రికార్డుల మీద రికార్డులను సృష్టిస్తూనే ఉంది.

 Ss Rajamouli Clarifies His Old Comment About Hrithik Roshan, Ssa Rajamouli, Hrit-TeluguStop.com

ఈ సినిమాలో నటించిన నటీనటుల పేర్లు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతున్నాయి.కాగా ఇటీవలే ఈ సినిమాలోని నాటు నాటు అనే పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు ని కూడా అందుకున్న విషయం అందరికీ తెలిసిందే.

దాంతో పాటుగా దర్శకుడు రాజమౌళి పేరు మారుమోగిపోతోంది.ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో నిలవడంతో అభిమానుల ఆనందానికి అలాగే చిత్ర బృందం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Telugu Hrithik Roshan, Ssa Rajamouli, Tollywood-Movie

ఈ సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో నిలవడంతో రాజమౌళి గత కొద్దిరోజులుగా అమెరికాలోనే పర్యటిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే అక్కడ మీడియాతో ముచ్చటించిన ఆయన గతంలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ను ఉద్దేశిస్తూ చేసిన వాక్యాలపై స్పందించారు.ఆ విషయంపై స్పందించిన రాబోయే రాజమౌళి మాట్లాడుతూ.ఇది జరిగి చాలా కాలం అవుతుంది.దాదాపుగా 15 – 16 ఏళ్ల గడిచిపోయింది.అప్పుడు నేను చేసిన కామెంట్స్ ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చాయో తెలియదు.

అది బిల్లా సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో ఆ విధంగా అన్నాను.బిల్లా సినిమా ఈవెంట్ కు నేను గెస్ట్ గా వెళ్లాను.

ఆ సమయంలో ప్రభాస్ ముందు హృతిక్ రోషన్ నథింగ్ అన్నాను.ఆ సమయంలో అలా అనడం కరెక్ట్ కాదు.

Telugu Hrithik Roshan, Ssa Rajamouli, Tollywood-Movie

నేను మాట్లాడిన పదాల ఎంపిక బాగోలేదు.కానీ హీరో హృతిక్ రోషన్ ను కించపరచడం నా ఉద్దేశం కాదు.హృతిక్ రోషన్ అంటే నాకు చాలా గౌరవం నేను ఆయనకు గౌరవం ఇస్తాను వివరణ ఇచ్చారు రాజమౌళి.కాగా అందుకు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రాజమౌళి అభిమానులు ఆయనపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

ఇకపోతే రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్స్ గా మారారు రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube