రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ 2023 సంక్రాంతికి రిలీజ్ అని అనుకోగా అది కాస్త వాయిదా పడ్డది.సినిమా టీజర్ లో గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయంటూ విపరీతమైన కామెంట్స్ రావడంతో మరో 100 కోట్లు బడ్జెట్ కేటాయించి మరీ సినిమాని ప్రేక్షకులకు నచ్చేలా చేస్తున్నారు.
ఇక ఇదిలాఉంటే ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సలార్ సినిమా కూడా ముగింపు దశలో ఉంది.ఈ సినిమా 2023 సెప్టెంబర్ లో రిలీజ్ ఫిక్స్ చేశారు.
అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆదిపురుష్ సినిమా సలార్ తర్వాతే రిలీజ్ అవుతుందట.
సినిమా మొత్తాన్ని మార్చేస్తున్నారట ఓం రౌత్.
అందుకే 2024 సంక్రాంతికి గానీ.సమ్మర్ లో కానీ ఆ సినిమా రిలీజ్ ఉంటుందని అన్నారు.
ప్రభాస్ నెక్స్ట్ రిలీజ్ సలార్ మాత్రమే అని ఫిల్మ్ నగర్ నుంచి వస్తున్న సమాచారం.అదే అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కి పండుగ అన్నట్టే లెక్క.
ఆదిపురుష్ తో పాటుగా మారుతి డైరెక్షన్ లో చేస్తున్న రాజా డీలక్స్ కూడా 2024 లోనే రిలీజ్ అంటున్నారు.మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ కి సలార్ తోనే వచ్చే ఏడాది స్పెషల్ ట్రీట్ అందించడం పక్కా అని చెప్పొచ్చు.