మోకాళ్ళ నొప్పులు.ఒకప్పుడు అరవై, డెబ్బై ఏళ్ళు దాటిన వారిలోనే ఈ సమస్య కనిపించేది.
కానీ ఇటీవల కాలంలో ముప్పై నలభై ఏళ్ల వారు సైతం మోకాళ్ళ నొప్పి మదన పడుతున్నారు.ఈ క్రమంలోనే మోకాళ్ళ నొప్పి నుంచి బయటపడడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
ఎన్నెన్నో మందులు వాడతారు.మోకాళ్ళ నొప్పికి ప్రధాన కారణం ఎముకల క్షీణత.
అందుకే ఎముకలను ఎప్పటికప్పుడు దృఢంగా మార్చుకునేందుకు ప్రయత్నించాలి.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.
ఈ రెమెడీని పాటిస్తే మోకాళ్ళ నొప్పి నుంచి సహజంగానే ఉపశమనాన్ని పొందొచ్చు.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు వేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి.ఆ తర్వాత అదే పాన్ లో నాలుగు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసి స్లైట్ గా ఫ్రై చేసుకోవాలి.
ఇక చివరిగా నాలుగు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు వేసి వేయించుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న గుమ్మడి గింజలు, నువ్వులు, అవిసె గింజలు వేసుకుని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
ఆ తర్వాత నాలుగు టేబుల్ స్పూన్లు నల్ల ఎండు ద్రాక్ష కూడా వేసి మళ్లీ గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో ఐదు టేబుల్ స్పూన్ల తేనె వేసి బాగా కలిపి ఒక గ్లాస్ జార్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని రోజుకు ఒక స్పూన్ చొప్పున ప్రతి రోజు తీసుకుంటే ఎముకలు దృఢంగా, బలంగా మారతాయి.దీంతో మోకాళ్ళ నొప్పులు పరార్ అవుతాయి.
మోకాళ్ళ నొప్పులతో సతమతం అయ్యే వారు ఈ రెమెడీ ని పాటిస్తే కొద్ది రోజుల్లోనే లేచి పరిగెట్టడం ఖాయం.