Mokshagna Balakrishna : మోక్షజ్ఞకు విలన్ గా బాలకృష్ణ.. అలా ప్లాన్ చేస్తే మామూలుగా ఉండదుగా?

మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి ఏ స్థాయిలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఒక దశలో మోక్షజ్ఞ సినిమాల్లోకి రాకపోవచ్చని కూడా జోరుగా ప్రచారం జరిగింది.

 Balakrishna Villain For Hero Mokshagna Details Here Goes Viral , Balakrishna-TeluguStop.com

అయితే బాలకృష్ణ మాత్రం 2023లో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వడం కారణమని చెబుతున్నారు.మోక్షజ్ఞ తొలి సినిమాకు దర్శకత్వం వహిస్తానని బాలయ్య చెబుతున్నా ఈ నిర్ణయం విషయంలో మార్పులు ఉండే ఛాన్స్ ఉంది.

మోక్షజ్ఞను హీరోగా బాలయ్యను నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చూపిస్తే బాగుంటుందని కొంతమంది దర్శకులు భావిస్తున్నారని తెలుస్తోంది.బాలయ్య గతంలో సుల్తాన్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించిన సంగతి తెలిసిందే.

మోక్షజ్ఞ హీరోగా తెరకెక్కే సినిమాలో బాలయ్య కీలక పాత్రలో నటించడానికి బదులుగా బాలయ్య విలన్ గా నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ విధంగా చేయడం వల్ల ఈ సినిమాకు భారీ స్థాయిలో మార్కెట్ జరుగుతుందని చెప్పవచ్చు.

నందమూరి హీరోలకు క్లాస్ సినిమాల కంటే మాస్ సినిమాలే అచ్చొచ్చాయని మోక్షజ్ఞను కూడా మాస్ హీరోగానే చూడాలని అనుకుంటున్నామని ఫ్యాన్స్ చెబుతున్నారు.మరోవైపు మీడియాకు దూరంగా ఉంటున్న మోక్షజ్ఞ మనసులో సినిమాలకు సంబంధించి ఉన్న నిర్ణయం ఏంటనే ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది.

Telugu Balakrishna, Mokshagna, Sultan, Nandamurikalyan-Movie

తారక్ సపోర్ట్ చేస్తే మాత్రం మోక్షజ్ఞ రేంజ్ మారిపోవడం అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.నందమూరి హీరోల మల్టీస్టారర్ కోసం ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో మోక్షజ్ఞ తొలి సినిమానే నందమూరి మల్టీస్టారర్ అయితే బాగుంటుందని ఫ్యాన్స్ సైతం భావిస్తున్నారు.నందమూరి కళ్యాణ్ రామ్ కూడా బింబిసార సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చి ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నారు.నందమూరి మోక్షజ్ఞ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సంబంధించి త్వరలో స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube