సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది.ఆరేళ్ల పాటు మర్రి శశిధర్ రెడ్డిని పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారని మర్రి శశిధర్ రెడ్డిపై అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.బీజేపీ నాయకులతో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలవడంతో పాటు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కించపరిచేలా మాట్లాడటంపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంది.
తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై, రేవంత్ రెడ్డిపై మర్రి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.