భారత్ లోనే తొలిసారి హైదరాబాద్లో ఇండియన్ రేసింగ్ లీగ్ ప్రారంభమైంది.ఇండియన్ కార్ రేసింగ్ లీగ్ క్వాలిఫియర్ ను జెండా ఊపి తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
హుస్సేన్ సాగర్ వద్ద ఇండియన్ రేసింగ్ లీగ్ నిర్వహించారు.రేసింగ్ ట్రాక్ ను సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు వేలాది మంది ప్రేక్షకులు కూర్చునే విధంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు.
కాగా ఐమాక్స్ ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నుంచి ఎన్టీఆర్ మార్గ్, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ పార్క్, ఐ మ్యాక్స్ వరకూ రస్ సర్క్యూట్ ఏర్పాటు చేశారు.ఇండియన్ కార్ రేసింగ్ లో పాల్గొన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడిని కేటీఆర్ అభినందించారు.