యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 2024 ఎన్నికలకు దూరంగా ఉండనున్నారని ఇప్పటికే స్పష్టత వచ్చింది.వచ్చే ఎన్నికల్లో తారక్ ఏ పార్టీకి సపోర్ట్ చేయబోరని సమాచారం అందుతోంది.
అయితే తారక్ 2024 ఎన్నికల్లో పోటీ చేయకపోయినా తారక్ సోదరి నందమూరి సుహాసిని ఏపీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారని సమాచారం అందుతోంది.గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సుహాసిని పోటీ చేయనున్నారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.
చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఆమె అక్కడినుంచి పోటీ చేయనున్నారని తెలుస్తోంది.గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రస్తుతం కొడాలి నాని ఎమ్మెల్యేగా ఉన్నారు.కొడాలి నానికి చెక్ పెట్టాలనే భావనతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని బోగట్టా.గత ఎన్నికల్లో తారక్, హరికృష్ణ అభిమానులు కొడాలి నానికి అనుకూలంగా ఓటు వేయడం వల్లే ఆయన గెలిచారని చాలామంది భావిస్తారు.
నందమూరి సుహాసిని పోటీ చేస్తే తారక్ సపోర్ట్ చేసినా చేయకపోయినా ఎన్టీఆర్ అభిమానులు నందమూరి సుహాసినికి అనుకూలంగా ఓట్లు వేసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.గుడివాడ ప్రజల్లో హరికృష్ణపై సానుభూతి ఉండటం కూడా సుహాసినికి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చాలామంది భావిస్తుండటం గమనార్హం.
నందమూరి అస్త్రాన్ని సంధించి గుడివాడలో టీడీపీ జెండా ఎగరవేయాలని సుహాసిని సైతం భావిస్తున్నారు.
నందమూరి సుహాసినికి ప్రజల్లో కూడా మంచి గుర్తింపు ఉంది.సుహాసిని కొన్నేళ్ల క్రితం కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.ఈ ఎన్నికల్లో ఆమె కచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
త్వరలో ఇందుకు సంబంధించి అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.తారక్ 2029 ఎన్నికల సమయానికి రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
తారక్ కు సోషల్ మీడియాలో భారీ రేంజ్ లో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే.