ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన దేశస్తులే కాకుండా చాలామంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని నమ్ముతారు.తమ ఇంట్లోనూ కూడా ఖచ్చితమైన వాస్తుతోనే నిర్మించుకుంటూ ఉంటారు.
అలా వాస్తు ప్రకారం నిర్మించుకోవడం వల్ల ఆ ఇంటి లో సంతోషం, శాంతి, శ్రేయస్సు ఉంటాయని వారి నమ్మకం.వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
సరిగ్గా లేకపోతే ఆరోగ్యం చేడి పోవడంతోపాటు, సంపద నష్టం కూడా జరిగే అవకాశం ఉంది.ప్రముఖ జ్యోతిష్యుడు మరియు వాస్తు కన్సల్టెంట్ పండిట్ కృష్ణకాంత్ శర్మ వంట గదిలో ఈ ఐదు వస్తువులను ఉంచుకోవాలని చెబుతున్నారు.
వీటిని ఎల్లప్పుడూ వంటగదిలో ఉండేలా చూసుకుంటే ఆ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని చెబుతున్నారు.మొదటిగా పసుపు వంట గదిలో కచ్చితంగా ఉండాల్సిందే.గురువును సూచించే ఈ పసుపు వంట గదిలో ఉండవలసిన ముఖ్యమైన వస్తువు.ఇది విష్ణువుకు చాలా ప్రీతికరమైనది.
అందువల్ల, పసుపు అయిపోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది.పసుపు అయిపోవడం వల్ల పిల్లల చదువులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.
అలాగే ఇంట్లో శుభ కార్యాలలో ఆటంకాలు ఎదురవుతాయి.
![Telugu Goddess Lakshmi, Kitchen, Salt, Vastu, Vastu Shastram, Vastu Tips, Yellow Telugu Goddess Lakshmi, Kitchen, Salt, Vastu, Vastu Shastram, Vastu Tips, Yellow](https://telugustop.com/wp-content/uploads/2022/11/Goddess-Lakshmi-kitchenhouse-salt.jpg )
వంట గదిలో బియ్యం ఎప్పుడు పూర్తిగా అయిపోయే వరకు ఉండకూడదు.ఇలా జరిగితే మాత్రం శుక్ల దోషం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.బియ్యం అయిపోతే ఇంటి అలంకరణ కూడా దెబ్బతినే అవకాశం ఉంది.
ఇంట్లో ఎప్పుడు బియ్యం ఉంటే లక్ష్మీదేవి సంతోషించి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది.వాస్తు శాస్త్రం ప్రకారం, వంటగదిలోని పిండి ఎప్పుడూ అయిపోకూడదు.
దీని వల్ల ఇంట్లో పేదరికం, సమాజంలో వ్యక్తి గౌరవం కోల్పోయే ప్రమాదం ఉంది.
ఉప్పు కూడా పంట గదిలో పూర్తిగా అయిపోయే వరకు అలాగే ఉండకూడదు.
అలా జరిగితే మాత్రం ఇంట్లో ప్రతికూలత వాస్తు దోషం ఏర్పడే అవకాశం ఉంది.అంతేకాకుండా వంటగదిలో పనిచేసే మహిళపై కూడా ప్రతికూల ప్రభావం ఉంటుంది.