ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఎప్పటినుండో కామెంట్లు వస్తున్నాయి.వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా కొద్ది వారాల క్రితం ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.
టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పలు సమావేశాలలో వ్యాఖ్యానించారు.ఇదిలా ఉంటే ఇప్పుడు మాజీ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా కూడా ముందస్తు ఎన్నికలు రాబోతున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.
డిసెంబర్ నెలలో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలు వెళ్లడానికి సీఎం జగన్ ఆలోచన చేస్తున్నారని పేర్కొన్నారు.ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఢిల్లీ పెద్దలను సీఎం జగన్ కోరినట్లు తెలియజేశారు.
సీబీఐ, ఈడీ రాజీల కోసం సీఎం ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకుంటున్నారని ఆరోపించారు.ఇంక వివేక హత్య కేసును జగన్ నిర్వీర్యం చేస్తున్నారు.
ఈ హత్య కేసుకు సంబంధించి విచారణ విషయంలో షర్మిల కూడా తప్పు పట్టారు అంటూ బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.