తిరుమల శ్రీవారిని తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మి పార్వతి దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఆలయం వెలుపల లక్ష్మి పార్వతి మీడియాతో మాట్లాడుతూ.బైఫర్ కేషన్ తో ఏపీ తెలుగు అకాడమీకి ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు.95 కోట్ల రూపాయలు నిన్న రాత్రి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయడం చాలా సంతోషమన్నారు. సీఎం జగన్ చొరవతోనే ఇది సాధ్యమైందని ఆమె కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్ లో మిగిలిన విభాగాలకు రావాల్సిన పీడింగ్ డబ్బులు సుప్రీమ్ కోర్టులో జరుగుతున్న విచారణ ద్వారా సాధ్యమవుతుందని చెప్పారు.తెలుగు అకాడమీ స్టాఫ్ సైతం తిరుపతి కేంద్రంగా పని చేయనున్నారని తెలిపారు.