ఏపీ అధికార పార్టీ వైసీపీలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం సందడిగా మారింది.త్వరలోనే నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతూ ఉండడం, ఆ ఖాళీ అయిన నాలుగు స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడుతుండడంతో, ఈ స్థానాల పై ఆశలు పెట్టుకున్న వారంతా తమకే ప్రాధాన్యం దక్కబోతోంది అనే ఆశతో ఉన్నారు.
ఈ ఏడాది జూన్ లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి.ఈ నాలుగు స్థానాలు ఎవరెవరికి కేటాయించబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది .పార్టీ సీనియర్ నాయకులు, 2019 ఎన్నికల సమయంలో టికెట్లు దక్కని కొంతమందికి రాజ్యసభ టికెట్ ఇస్తామంటూ జగన్ హామీ ఇచ్చారు.దీంతో ఇప్పుడు ఖాళీ కాబోతున్న స్థానాలపై గతంలో హామీ పొందిన వారంతా ఆశలు పెట్టుకోగా , జగన్ మాత్రం రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ .రానున్న రోజుల్లో పార్టీకి, ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా అభ్యర్థుల ఎంపికను చేపట్టే ఆలోచనలో ఉన్నారట. ఈ మేరకు ప్రముఖ పారిశ్రామిక వేత్త తనకు అత్యంత సన్నిహితుడైన గౌతమ్ ఆధాని భార్య ప్రీతి ఆధానికి రాజ్యసభ సభ్యత్వం వైసీపీ తరఫున ఇవ్వబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఢిల్లీ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని బిజెపికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న గౌతమ్ ఆదానీ భార్యకు టికెట్ కేటాయించాలని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.గౌతమ్ ఆదాని ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉండడంతో.
ఏపీకి భారీ ఎత్తున పరిశ్రమలను తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో పాటు , బిజెపిని మరింత దగ్గర చేసుకోవచ్చు అనే ఆలోచనతో జగన్ ఉన్నారట. అయితే మిగతా మూడు స్థానాల విషయంలోనూ జగన్ తీసుకున్న నిర్ణయం పార్టీ నేతలకు ఆగ్రహం కలిగిస్తోంది .ఒక స్థానాన్ని ప్రీతి ఆదానికి కేటాయిస్తే , మరో స్థానంలో జగన్ వ్యక్తిగత న్యాయవాది నిరంజన్ రెడ్డికి, ఇంకో స్థానాన్ని ప్రస్తుత వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారట.

ఇక నాలుగో స్థానాన్ని మైనారిటీ లేదా దళిత వర్గానికి ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నారట.కానీ ఈ రాజ్యసభ స్థానాల్లో తమకు తప్పకుండా అవకాశం దక్కుతుందని ఆశలు పెట్టుకున్న చిలకలూరిపేట నాయకుడు మర్రి రాజశేఖర్ తో పాటు, టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, సినీ నటుడు ఆలీ, నటుడు మోహన్ బాబు , పోసాని కృష్ణ మురళి వంటివారు ఎందరో ఆ పదవులపై అసలు పెత్తుకోగా జగన్ కొత్త పేర్లు తెరపైకి తెస్తుండడం పార్టీలో అసంతృప్తి కారణం అవుతోంది.







