మన ప్రపంచంలో అప్పుడప్పుడు కొన్ని విడ్డురాలు చోటు చేసుకుంటాయి.ప్రాణం విలువ ఒక్క మనుషులకే కాదు మా పక్షులకు కూడా తెలుసు అని ఓ కాకి చాటి చెప్పిన ఘటన తాజాగా చోటుచేసుకుంది.
ఓ జీవి ప్రమాదంలో ఉంటే మిగతా జీవులు వెంటనే స్పందించి ప్రమాదం నుంచి బయటపడేసే ఘటనలు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం.అలాగే చిన్నప్పుడు పుస్తకాల్లో కాకులు.
ఉడుతలు తాబేలు వంటివి సహాయం చేసుకునే కథలు విన్నాం.అయితే ఇపుడు ఆ కథలు కల్లలు కాదు, నిజమే అంటూ ఓ కాకి నిరూపించింది.
ఇక ఆ కథేమిటో తెలుసుకుందాం.
అక్కడ ఓ రోడ్డుమీద ఓ మినీ ముళ్లపంది అక్కడినుండి ముందుకు వెళ్లలేక మధ్యలోనే కొట్టుమిట్టాడుతూ ఉండిపోయింది.
పైగా వాహనాలు ఎక్కువగా తిరుగుతున్న ప్రదేశం అది.డ్రైవర్లు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ముళ్లపంది చనిపోయేదే.అయితే ఇంతలో ఓ కాకి హీరోలా అక్కడికి వచ్చింది.ముళ్ళపంది ఇబ్బందిని గమనించిన కాకి పందిని ముక్కుతో పొడవడం మొదలుపెట్టింది.దీంతో ఆ జీవికి ముందుకు వెళ్లే శక్తి వచ్చింది.దాంతో ముందుకు జరిగింది.
మరలా కొంతదూరం వెళ్లి ఆగిపోవడంతో మళ్లీ ఆ కాకి దాన్ని ముక్కుతో కదిలిస్తే ఇంకాస్త దూరం కదిలింది ఆ పంది.

అలా ఆఖరికి ఆ కాకి ఆ ముళ్ల పందిని రోడ్డు చివరి వరకు క్రాస్ చేయించి దాని ప్రాణాన్ని కాపాడింది.ఈ వీడియో ఎవరో సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ హల్‌చల్ చేస్తోంది.కాకి మానవత్వానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
మనుషులు కూడా మానవత్వాన్ని మరిచిన రోజుల్లో కాకి స్పందన చూసి సోషల్ మీడియాలో రకరకాలుగా స్పందిస్తున్నారు.మనుషులు కాస్త అలోచించి అలా ఆపదలో ఉన్న అందరికీ సాయం చేస్తే ఎంత బాగుంటుందో అని కామెంట్స్ చేస్తున్నారు.







