దిగ్గజ దివంగత సింగర్ కమ్ డ్యాన్సర్ మైఖేల్ జాక్సన్ తన బిల్లీ జీన్ పాటలో మొదటిసారిగా మూన్‌వాకింగ్ చేసి డ్యాన్సింగ్‌లో ఒక హిస్టరీ క్రియేట్ చేశారు.మూన్‌వాకింగ్‌తో డ్యాన్స్ ఇంత అద్భుతంగా కూడా చేస్తారా అని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని మైకల్ జాక్సన్ మంత్రముగ్ధులను చేశారు.
దీనిని మొదటగా వేరే వ్యక్తి మైకల్ జాక్సన్‌కి నేర్పించారని అంటారు.అయితే ఈ డ్యాన్స్ మూవ్ పర్ఫెక్ట్‌గా చేయడం చాలా కష్టం.
కొందరు డ్యాన్సర్లు మాత్రం పట్టుదలతో దీనిని నేర్చుకుని అందరినీ ఫిదా చేస్తుంటారు.కొందరు మాత్రం కొంత ముందడుగు వేసి దీన్ని కొత్తగా చేస్తూ అందరి చేత వావ్ అనిపిస్తున్నారు.
మన ఇండియాకి చెందిన జయదీప్ అనే డ్యాన్సర్ మాత్రం మూన్‌వాకింగ్ నీటిలో చేసి ప్రతి ఒక్కరి చేత చప్పట్లు కొట్టించుకుంటున్నాడు.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దీన్ని చూసి నెటిజన్లు అబ్బుర పడుతున్నారు.“వావ్, ఇది అద్భుతంగా ఉంది.మా కళ్లను మేమే నమ్మలేకపోతున్నాం” అని కామెంట్ చేస్తున్నారు.ఇంతకీ వైరల్ అవుతున్న వీడియోలో ఏముందో తెలుసుకుంటే.జయదీప్ స్విమ్మింగ్ పూల్‌లోని నీటిలోకి సాంతం మునిగాడు.ఆ నీటిలోనే ఈ ఒక పూల్ గేమ్ టేబుల్‌ను ఉంచారు.
ఆ టేబుల్‌పై జయదీప్ నిల్చున్నాడు.అనంతరం దానిపై మైకల్ జాక్సన్ వలె చాలా పర్ఫెక్ట్ గా మూన్ వాక్ చేసాడు.అంతేకాదు నీటిలో తలకిందులుగా తిరిగి ఈ ఛాలెంజింగ్ డ్యాన్స్ మూవ్ చేసి అదరగొట్టాడు.@hydroman_333 అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే 9 లక్షలకు పైగా లైక్స్, మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.నెటిజనులు ఈ వీడియో చూసి అతన్ని చాలా పొగుడుతున్నారు.సూపర్ గా చేసావు బ్రదర్ అని కితాబిస్తున్నారు.దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.