లేటెస్ట్ సెంచరీని ఆ ఇద్దరికీ డెడికేట్ చేసిన కోహ్లీ.. వారెవరంటే..!

విరాట్ కోహ్లీ తాజాగా ఒక అద్భుతమైన సెంచరీ సాధించాడు.అతని ఇంటర్నేషనల్ కెరీర్‌లో ఇది 71వ సెంచరీగా నమోదయింది.

 Kohli Dedicated The Latest Century To Both Of Them Who Are They , Virat Kohli ,-TeluguStop.com

అయితే ఈ సెంచరీని తన సతీమణి అనుష్క శర్మ, ముద్దుల కుమార్తె వామికాకు అంకితం చేస్తూ కోహ్లీ అందర్నీ ఫిదా చేశాడు.నిజానికి కోహ్లీ ఒక సెంచరీ చేయక చాలా ఏళ్లు గడుస్తోంది.

ఫ్యాన్స్ కూడా ఎంతో కాలంగా వేచి చూస్తున్నారు.అయితే ఎట్టకేలకు అతనొక సెంచరీ చేసి ఫ్యాన్స్‌ను ఖుషి చేశాడు.

ఎన్నాళ్ళకో చేసిన ఈ సెంచరీని తన భార్య, కుమార్తెకు అంకితమిచ్చాడు.

సెప్టెంబర్ 8న ఆసియా కప్ 2022 సూపర్ 4 మ్యాచ్‌లో అఫ్ఘనిస్తాన్‌పై కోహ్లి 61 బంతుల్లో 122 పరుగులతో చేశాడు.అంతేకాదు ఈ మ్యాచ్‌లో నాటౌట్‌గా నిలిచాడు.6 సిక్సర్లు, 12 బౌండరీలతో కింగ్ కోహ్లీ రెచ్చిపోయాడు.1020 రోజుల తర్వాత కోహ్లీ చేసిన మొదటి సెంచరీ ఇది.ఈ సెంచరీతో కోహ్లీ అభిమానులు మళ్లీ సంబరాలు చేసుకుంటున్నారు. విరాట్ కోహ్లి కెప్టెన్‌గా వైదొలిగిన తర్వాత తన కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా చాలా గందరగోళానికి ఫీల్ అయ్యాడు.ఈ సమయంలో తన భార్య అనుష్క శర్మ తనకు ఎంతగానో సహాయపడిందని కోహ్లీ చెప్పాడు.

ఆమె సపోర్ట్‌తో తాను ఈరోజు సెంచరీ చేయగలిగానని అన్నాడు.

Telugu Anushka Sharma, Asia Cup, Century, Cricket, Vamika, Virat Kohli-Latest Ne

ఈ సెంచరీకి ముందు కోహ్లి చివరిసారిగా ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 2019 నవంబర్‌లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన పింక్-బాల్ టెస్టులో సెంచరీ కొట్టాడు.ఎబీ డివిలియర్స్, సురేష్ రైనా, యూసఫ్ పఠాన్ వంటి స్టార్ క్రికెటర్లు కూడా కోహ్లీ తాజాగా చేసిన సెంచరీపై కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు.కింగ్ కోహ్లీ ఇజ్‌ బ్యాక్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube