టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్నటువంటి క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే.మెగా కుటుంబం నుంచి ఇప్పటికే ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.
ఇదిలా ఉండగా మెగా అల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా గిరీషయ్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రంగ రంగ వైభవంగా.ఈ సినిమాలో వైష్ణవ్ రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ నటించారు.
ఇక ఈ సినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని సెప్టెంబర్ రెండవ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయింది.
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకకు మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయిన విషయం మనకు తెలిసిందే.
ఇది ఇలా ఉండగా ఈ ముగ్గురు హీరోలకు యాంకర్ సుమ రాపిడ్ ఫైర్ ప్రశ్నలు వేస్తూ వారి నుంచి సమాధానాలు రాబట్టింది.ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భూమిక జంటగా 2001 సంవత్సరంలో విడుదలైన ఖుషి సినిమా గురించి ప్రశ్నించారు.
![Telugu Ketika Sharma, Khushi, Pawan Kalyan, Sai Dharam Tej, Supreme, Vaishnav-Mo Telugu Ketika Sharma, Khushi, Pawan Kalyan, Sai Dharam Tej, Supreme, Vaishnav-Mo](https://telugustop.com/wp-content/uploads/2022/09/Khushi-Supreme-Hero-sai-dharam-tej.jpg)
ఖుషి సినిమాని కనక రీమేక్ చేస్తే మీ ముగ్గురిలో ఎవరితో చేస్తే బాగుంటుంది అని సుమ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు సాయి ధరమ్ తేజ్ సమాధానం చెబుతూ ఖుషి సినిమా రోల్ చేసే వన్ అండ్ ఓన్లీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మామయ్య మాత్రమే ఆ పాత్రను చేయగలరు.ఆ పాత్రను మరెవరు భర్తీ చేయలేరు అంటూ ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ఖుషి సినిమా గురించి కామెంట్స్ చేశారు.అప్పట్లో ఈ సినిమా ఎలాంటి బ్లాక్ బాస్టర్ అయిందో మనకు తెలిసిందే.
ఇక ఇందులో పాటలు ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.లవ్ అండ్ యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లోనే ఎప్పటికీ చెప్పుకోదగ్గ సినిమా అని చెప్పాలి.