ఫ్యాన్స్ అడ్డుకున్న కూడా జయప్రద చిన్ననాటి ఇంటిని ఎవరు కూల్చారు.?

లలితా రాణి.ఈ పేరు చెప్తే ఎవ్వరు గుర్తుపట్టరు కానీ జయప్రద అని చెప్తే చాలు తెలుగు అందాల నటి అందరికి గుర్తుకు వస్తుంది.

ఆమె తన అందంతో, అనుకువతో, నటనతో తెలుగు లో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.కేవలం సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ రాణించి తనకు ఎవరూ సాటి లేరు అని నిరూపించుకుంది.

ఆంధ్రప్రదేష్, రాజమండ్రిలో పుట్టి పెరిగిన జయప్రద దేశ రాజకీయాల్లో సైతం తనదైన ముద్రను వేసుకుంది.అయితే రాజమండ్రిలో తను చిన్నప్పుడు పెరిగిన ఇంటితో ఆమెకు ఎనలేని అనుబంధం ఉంది.

తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎన్నోసార్లు ఎమోషనల్ అయ్యేవారు జయప్రద.మూడవ తరగతి నుంచి నాట్యం నేర్చుకున్న జయప్రద స్కూల్లో ఒక ప్రదర్శన ఇస్తున్న సమయంలో ఎం ఎస్ ప్రభాకర్ రెడ్డి కంట్లో పడ్డారు.

Advertisement

ఇక భూమి కోసం అనే ఒక సినిమాలో మూడు నిమిషాల నిడివి గల ఒక పాత్ర కోసం జయప్రదన తీసుకొని తొలిసారిగా తెలుగు తెరకు పరిచయం చేశారు ప్రభాకర్ రెడ్డి.వాస్తవానికి జయప్రద తండ్రి,  బాబాయి ఇద్దరూ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారే అయినప్పటికీ కూడా జయప్రద తన సొంత టాలెంట్ తోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

అలా తెలుగు సినిమా పరిశ్రమ నుంచి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా మన తెలుగు ఖ్యాతిని విస్తరించింది.అయితే రాజమండ్రిలో తను పుట్టి పెరిగిన ఇంటిని మాత్రం ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడం కోసం కూల్చి వేయాల్సి వచ్చింది.ఆ సమయంలో అభిమానులంతా కూడా అక్కడ గమిగుడి ఆ ఇంటిని కూల్చవద్దు అంటూ అడ్డుకున్నారు.

అది పూర్తిగా జయప్రద వ్యక్తిగత వ్యవహారం కావడంతో ఎవరు ఏమీ చేయలేకపోయినా అభిమానులందరూ కూడా తన పైన చూపిస్తున్న అభిమానానికి ఎంతగానో రుణపడి ఉంటాను అంటూ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు జయప్రద.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు