టాలీవుడ్ హీరోయిన్ మలయాళీ బ్యూటీ నిత్యామీనన్ గురించి అందరికీ పరిచయమే.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అతి తక్కువ సమయంలో ప్రేక్షకుల హృదయాలను దోచుకొని మంచి అభిమాన హీరోయిన్ గా నిలిచింది.ఇక స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుని మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
తెలుగుతో పాటు తమిళ, ఇంగ్లీష్, మలయాళ, కన్నడ భాషల్లో కూడా నటించింది.
తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి 1998లో బాలనటిగా అడుగు పెట్టింది.
ఆ తర్వాత 2010లో అలా మొదలైంది సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.
ఆ తర్వాత వరుసగా ఎన్నో అవకాశాలు అందుకోగా తనకు మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఇష్క్, సన్నాఫ్ సత్యమూర్తి, జనతా గ్యారేజ్ వంటి సినిమాలు మంచి సక్సెస్ ను ఇచ్చాయి.
కొన్ని సినిమాలలో అతిధి పాత్రలలో కూడా నటించింది.
ఇదిలా ఉంటే తాజాగా నిత్యామీనన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి కొన్ని విషయాలు బయట పెట్టింది.ఇటీవలే తన పెళ్లి గురించి కొన్ని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక ఆ విషయం గురించి స్పందించింది నిత్యామీనన్.తన పెళ్లి గురించి వచ్చిన వార్తల్లో నిజాలు లేవు అని.అన్నీ అవాస్తవాలే అని తెలిపింది.
![Telugu @dulquer, Ishq, Janatha Garage, Nithyamenon, Nithya Menon, Nitya Minon, T Telugu @dulquer, Ishq, Janatha Garage, Nithyamenon, Nithya Menon, Nitya Minon, T](https://telugustop.com/wp-content/uploads/2022/08/nithya-menon-shocking-comments-about-marriage-dulquer-salman-detailss.jpg)
ఇది అందరూ కలిసి క్రియేట్ చేసిన స్టోరి అంటూ.ఓ సంవత్సరం రోజుల నుంచి గ్యాప్ లేకుండా వరుసగా సినిమా షూటింగ్స్‌తో ఫుల్ బిజీగా ఉంటూ వస్తున్నానని.అదే సమయంలో కాలు బెణికిందని తెలిపింది.
దాంతో కాస్త రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిందని.ఆ సమయంలో కథలు చెబుతామని కొందరు వచ్చినా కూడా రెస్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు వినట్లేదని చెప్పిందట.
దీంతో ఎందుకు నిత్యా మీనన్ కథలు వినటం లేదు అనే ప్రశ్న అక్కడే మొదలైందని.కథలు వినడం లేదు అంటే పెళ్లి చేసుకుంటుందేమో అనే వార్తలు సృష్టించారు అని అన్నది.
ఇక దుల్కర్ సల్మాన్ గురించి ప్రశ్న ఎదురవ్వడంతో.ఆయన తనకు చాలా మంచి స్నేహితుడని.
తనకు కుటుంబంతో గడపటం అంటే ఎంతో ఇష్టమని.తన ఫ్యామిలీతో చాలా సంతోషంగా ఉన్నాడని తెలిపింది.
![Telugu @dulquer, Ishq, Janatha Garage, Nithyamenon, Nithya Menon, Nitya Minon, T Telugu @dulquer, Ishq, Janatha Garage, Nithyamenon, Nithya Menon, Nitya Minon, T](https://telugustop.com/wp-content/uploads/2022/08/nithya-menon-shocking-comments-about-marriage-dulquer-salman-detailsd.jpg)
ఇక తనను కలిసినప్పుడల్లా నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలి అని అంటుంటాడని తెలిపింది.ఇక తన పెళ్లి గురించి ఇప్పుడే ఎలా చెప్పగలనని.భవిష్యత్తుని ముందే చెప్పలేను కదా అంటూ.అలాగని పెళ్లే చేసుకోనని చెప్పటం లేదని అన్నది నిత్య.ఇక తాను సినిమాల ఎంపిక గురించి ఎక్కువగా ఆలోచించనని తెలిపింది.వినేటప్పుడు ఎగ్జయిట్ అయితే చాలని.
ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేస్తానని అన్నది.
ఇక తాను ఇండస్ట్రీలో ఎప్పుడూ ఎదుర్కొనే ఇబ్బంది ఏంటంటే.
తనను సినిమా ఇండస్ట్రీ బ్యాన్ చేసిందనే వార్తలు పుట్టించారని.చాలా రూమర్స్ క్రియేట్ చేశారని.
కావాలనే తన గురించి తప్పుగా చెబుతుంటారని ఆవేదన వ్యక్తం చేసింది.ఒకరు మనకంటే బాగా ఎత్తులో ఉంటే కిందకి లాగాలనుకోవటం కొందరికి చాలా ఇష్టమంటూ.
మనం వారి ప్రలోభాలకు లొంగనప్పుడు ఆమెతో చాలా కష్టమంట.వేగలేమట.
ఇలా అలా అంటూ వార్తలను పుట్టించేస్తారని కామెంట్లు చేసింది.ప్రస్తుతం ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.