ఎంతటి గార పట్టిన పసుపు పళ్ళు( yellow teeth ) అయినా తెల్లగా ముత్యాల మెరిసిపోవాలంటే ఇలా చేయాలి.పళ్ళు తెల్లగా అందంగా మెరుస్తూ ఉండాలని చాలామంది కోరుకుంటారు.
చాలామంది పళ్ళు గార పట్టి పసుపు రంగులోకి మారిపోయి ఉంటాయి.అంతే కాకుండా మరి కొంతమందికి చిగుళ్ళ వాపు కూడా ఉంటుంది.
అలాగే నోటి దుర్వాసన కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది.ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వైద్యుల చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే సహజ సిద్ధంగా ఉండే వస్తువులను ఉపయోగించి సులభంగా చాలా తక్కువ ఖర్చుతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
ఈ రెమెడీ కోసం బిర్యానీ ఆకులను( Biryani leaves ) ఉపయోగించాలి.బిర్యాని ఆకు గార పట్టిన పళ్ళ ను తెల్లగా మారుస్తుంది.బిర్యాని ఆకులో ఉన్న పోషకాలు చిగుళ్ల వాపు, నోటి దుర్వాసన, పుచ్చు పళ్ళను తగ్గించడానికి ఎంతో ఎఫెక్ట్ గా పని చేస్తుంది.బిర్యానీ ఆకులను మిక్సీలో వేసి మెత్తనీ పొడిగా తయారు చేసుకోవాలి.
ఒక బౌల్ లో రెండు స్పూన్ల బిర్యానీ ఆకుల పొడి, ఒక స్పూన్ ఉప్పు,( salt ) ఒక స్పూన్ నిమ్మరసం( lemon juice ), ఒక స్పూన్ రెగ్యులర్ గా వాడే టూత్ పేస్ట్ వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని ఎక్కువ మోతాదులో చేసుకుని ఫ్రిజ్లో పెడితే వారం రోజుల వరకు ఉంటుంది.

ఈ మిశ్రమంతో పళ్ళు తోముకుంటే పంటి మీద గారా, పసుపు రంగు తొలగి పళ్ళు ముత్యాల మెరుస్తూ ఉంటాయి.ఈ రెమెడీ లో ఉపయోగించిన ఉప్పు చిగుళ్ళు స్ట్రాంగ్ గా ఉండడానికి, అలాగే పంటి మీద గారలు తొలగించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.ఈ రెమిడి ఫాలో అవుతూ ఇప్పుడు చెప్పే మౌత్ ఫ్రెషనర్ తో నోటిని శుభ్రం చేసుకుంటే ఇంకా తొందరగా ఫలితం వస్తుంది.మౌత్ ఫ్రెషనర్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక బౌల్ లో నాలుగు బిర్యానీ ఆకులు, నాలుగు లవంగాలు, సగం నిమ్మకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి.ఆ తర్వాత గోరువెచ్చని నీటిని అందులో పోసి మూత పెట్టి ఒక గంట అలానే వదిలేయాలి.ఆ తర్వాత ఈ నీటిని గోరువెచ్చగా చేసుకొని ఒక చిన్న గ్లాసులో పోసుకొని నోటిని శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించాలి.ఈ విధంగా చేయడం వల్ల నోటి దుర్వాసన తగ్గడమే కాకుండా దంతాలు దృఢంగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు.