సహజీవనం. దీనినే పాశ్చాత్య దేశాల్లో లివింగ్ రిలేషన్ షిప్ అంటారు.ఇది వరకు ఈ పథం కూడా మనకు తెలియదు.కానీ ఆధునిక పోకడలు ఎక్కువ అవుతున్న ఈ తరుణంలో సినీ సెలెబ్రిటీలే కాకుండా మాములు సాధారణ ప్రజలు సైతం ఈ సహజీవనం కాన్సెప్ట్ కు బాగా అలవాటు పడ్డారు.
ఇక సెలెబ్రిటీల గురించి అయితే చెప్పాల్సిన పని లేదు.వీరి లైఫ్ లో పెళ్ళికి ముందే ప్రేమ, సహజీవనం, బ్రేకప్ లు ఇలా చాలానే ఉంటాయి.మరి సెలెబ్రెటీల్లో ఎవరు పెళ్ళికి ముందే సహజీవనం చేసారో.ఆ జంటలు పెళ్లి వరకు వెళ్ళాయో లేదో చూద్దాం.
మన టాలీవుడ్ జంటల్లో పెళ్ళికి ముందే సహజీవనం చేసిన వారిలో పవన్ కళ్యాణ్- రేణు దేశాయ్ ఉంటారు.వీరు పెళ్ళికి ముందే సహజీవనం చేసి పిల్లలు కూడా పుట్టిన తర్వాత పెళ్లి చేసుకున్నారు.
ఇక కొన్నాళ్ల పాటు కలిసి ఉన్న ఈ జంట ఇప్పుడు విడాకులు తీసుకుని ఎవరి జీవితం వారు జీవిస్తున్నారు.
ఇక మరో జంట గురించి మాట్లాడాలంటే నాగ చైతన్య – సమంత గురించే చెప్పుకోవాలి.
వీరిద్దరూ కూడా పెళ్ళికి ముందు ఒకే ఇంట్లో కలిసి సహజీవనం సాగించినట్టు అప్పట్లో రూమర్లు వచ్చాయి.ఆ తర్వాత కొన్నాళ్ళకు వీరు పెళ్లి చేసుకున్నారు.
కానీ నాలుగేళ్లకు విడాకులు తీసుకుని అందరికి షాక్ ఇచ్చారు.

శ్రీదేవి – బోణీ కపూర్. వీరిద్దరూ కూడా పెళ్ళికి ముందే కాపురం పెట్టేసారు.అప్పటికే బోణీ కపూర్ కు పెళ్లి అయ్యి పిల్లలు కూడా ఉన్నారు.
అయినా శ్రీదేవి బోణీ తో సహజీవనం చెసి ఆ తర్వాత ఎన్నో గొడవల మధ్య పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.ఇక ఆ తర్వాత శ్రీదేవి కి ఇద్దరు డాటర్స్ పుట్టారు.
ఇప్పటికే జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.అయితే శ్రీదేవి హఠాత్తు మరణం అందరిని కలిచి వేసింది.
అమీర్ ఖాన్ – కిరణ్ రావ్.వీరిద్దరూ పెళ్ళికి ముందు కలిసి జీవించారు.ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు.దడపా ఏడాదిన్నర పాటు కలిసి సహజీవనం చేసినట్టు అమీర్ స్వయంగా చెప్పుకొచ్చాడు.
ఇక ఇటీవలే వీరిద్దరూ విడిపోయి అందరికి పెద్ద షాక్ ఇచ్చారు.

సైఫ్ అలీ ఖాన్ – కరీనా కపూర్ కూడా పెళ్ళికి ముందు కొన్నేళ్ల పాటు సహజీవనం సాగించి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు.ఈ జంట ప్రెజెంట్ ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు.
ఇక క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ హీరోయిన్ అనుష్క శర్మ కూడా పెళ్ళికి ముందు కొన్నేళ్ల పాటు సీక్రెట్ గా సహజీవనం సాగించారు.
ఆ తర్వాత వీరిద్దరూ పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు.ఇలా ఈ జంటలు అందరికి తెలిసేలా సహజీవనం చేసారు.అయితే మన సినీ ప్రపంచంలో ఇంకా తెలియకుండా సహజీవనం చేసిన జంటలు చాలా మందే ఉన్నారు.