తెలుగు ఇండస్ట్రీలో తండ్రి బడ నిర్మాత అయిన అన్నయ్య పెద్ద స్టార్ అయిన తమ్ముడికి మాత్రం అవకాశాలు అంతంత మాత్రమే ఉన్నాయి.ఆ హీరో ఎవరబ్బా అని అనుకుంటున్నారా మరెవరో కాదు అల్లు శిరీష్.
ఏ బి సి డి చిత్రంతో ప్రేక్షకులు అలరించిన అల్లు శిరీష్ ఇంతవరకు మరో చిత్ర అప్డేట్ ను ఇవ్వలేదు.ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో కూడా అల్లు శిరీష్ ఊసు కనబడడం లేదు.
అయితే తాజాగా గన్నవరం విమానాశ్రయంలో అల్లు శిరీష్ కు ఒక వింత అనుభవం ఎదురయింది అదేంటో చదివేయండి మరి.
గత ఏడాది హైదరాబాద్‌లోని అల్లు స్టూడియోస్ ఆవరణలో రామలింగయ్య విగ్రహాన్ని ఆయన మనవళ్లు ఆవిష్కరించారు.ఈ నేపథ్యంలో అల్లు శిరీష్ తన తాత అల్లు రామలింగయ్య విగ్రహ ఆవిష్కరణ పోస్టర్ లాంచ్ కార్యక్రమానికి గన్నవరం వెళ్లడం జరిగింది.అల్లు శిరీష్ కోసం అభిమానులు ఓ కారు ఏర్పాటు చేయగా.
ఆయన పొరబాటున వేరే ట్రావెల్ కారు ఎక్కారు.కారు కదులుతుండగా… ఆ కారుకు సంబంధించిన వ్యక్తులు వచ్చి తాము బుక్ చేసుకున్నామని తెలపడంతో శిరీష్ కారు దిగారు.
ఆ తర్వాత అభిమానులు ఏర్పాటు చేసిన కారులో వెళ్లారు.ఈ క్రమంలో ఇన్నాళ్ల తర్వాత సోషల్ మీడియా వార్తలు వైరల్ అవుతున్నారు హీరో అల్లు శిరీష్.అయితే ఆ మధ్య కాలంలో అను ఇమ్మానుయేల్ తో కలిసి సినిమా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ కూడా చేయగా ఆ సినిమా ఇప్పటికీ విడుదల కాలేదు.
చూడాలి మరి ఆ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా లేదా అనేది.లేదా ఈ ఏడాదిలో అయినా శిరీష్ కొత్త సినిమా అప్డేట్ ఇస్తారో లేదో అనేది తెలియాలంటే ఈ ఏడాది వరకు ఆగాల్సిందే.