హనుమంతుడి శరీరానికి సింధూరమే ఎందుకు? ఎపుడైనా ఆలోచించారా?

మన సనాతన సంప్రదాయాలు పునీతనమైనవి.హిందూ దేవాలయాలు, దేవుళ్ళు, సాంప్రదాయాలు, పూజా విధానాలు అన్నీ ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి.

 Why Is Sindhuram On Hanuman's Body Ever Wondered Hanuman, Body, Traditional N-TeluguStop.com

మన దేశంలో భక్తికి ఉన్నంత ప్రాధాన్యత మరే ఇతర అంశాలకు ఉండదంటే నమ్మశక్యం కాదు.ఇక్కడ డబ్బున్న వాళ్లకు లేని వాళ్లకు దేవుడు ఒక్కటే.

ఇక హిందూ దేవుళ్ళకు ఉండే ఆచార విషయాలకు ఎంతో చరిత్ర ఉందని ప్రతీతి.అలాంటి ఒక ఆసక్తికర విషయం గురించి ఇపుడు తెలుసుకుందాం.

రామ భక్తుడు హనుమతుడికి సింధూరం రాయడం గురించి మనకు తెలిసినదే.కొన్ని ఆలయాల్లో స్పెషల్ గా హనుమంతునికి ఒళ్లంతా సింధూరం రాస్తారు.

అయితే దీని వెనకాల కారణం చాలామందికి తెలియదు.విషయం ఏమంటే.

సీతామాత తన పాపిటలో సింధూరం ధరించేది.అది చూసి హనుమంతుడు “తల్లీ, నువ్వు సింధూరం ఎందుకు ధరిస్తున్నావు? అని అడగగా.ఈ రంగు శ్రీ రామునికి ఎంతో ప్రీతిపాత్రమైనది అని సమాధానం ఇచ్చింది.సీతమ్మ ఇచ్చిన సమాధానంతో హనుమతుడు కూడా అదే అనుసరించారు.తన ఇష్ట దైవం శ్రీ రామునికి ఇష్టము కాబట్టి తాను కూడా ధరిస్తానని అప్పటినుండి హనుమాన్ దాన్ని ధరించేవారిని నానుడి.

అయితే ఆ రంగు మహిళలకు మల్లే పాపిటలో ధరించడం కుదరదు కాబట్టి హనుమాన్ తన ఒళ్ళంతా పూసుకున్నాడని చెబుతారు.

ఈ వృత్తాంతాన్ని అనుసరించే దేవాలయాల్లో హనుమంతుడికి ఆ విధంగా ప్రతిమ నిండా ఆ రంగు రాస్తారు.ఇక మరో వాదన కూడా ఉంది.సీతా దేవి శరీరమంతా సింధూరం ధరించారని కొందరు చెప్తారు.కాని పాపిటలోనే ధరించిందని మన పురాతన పుస్తకాలు చెబుతున్నాయి.

ఇక రాముని పట్ల హనుమాన్ యెంత భక్తి శ్రద్ధలతో ఉంటాడో అందరికీ తెలిసినదే.భక్తికి ప్రతిరూపం హనుమాన్.

అందుకే ప్రతి ఊరూ.వాడా హనుమాన్ రూపాలు శిలా విగ్రహాలై వెలిసాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube