టాలీవుడ్ ఇప్పుడు మిగతా ఇండస్ట్రీల కంటే స్పీడ్ గా దూసుకు పోతుంది.వరుసగా చిన్న హీరోల నుండి స్టార్ హీరోల వరకు.
సీనియర్ హీరోల నుండి టైర్ 2 హీరోల వరకు అందరు క్షణం తీరిక లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు.కానీ మన టాలీవుడ్ లో ఇద్దరు స్టార్ హీరోలు మాత్రం షూటింగులు లేకుండా హ్యాపీగా ఫ్యామిలీతో గడుపు తున్నారు.
ఇద్దరు కూడా పాన్ ఇండియా స్టార్స్.చేతిలో వరుసగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి.కానీ ఇద్దరు సేమ్ టు సేమ్ షూటింగులు లేకుండా ఇంట్లో గడుపు తున్నారు.మరి ఆ పాన్ ఇండియా స్టార్స్ ఎవరు? వారి సినిమాల గోల ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.ఈయన గురించి తెలియని సినీ ప్రేక్షకుడు లేరు.అంతలా ఈయన తన నటనతో ఆకట్టుకున్నాడు.పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోల లిష్టులో చేరిపోయాడు.
అల్లు అర్జున్ హీరోగా ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప ది రైజ్.నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన పుష్ప సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి అన్ని రికార్డులను తిరగ రాసింది.
ఇక పుష్ప సినిమా పార్ట్ 1 ఘన విజయంతో కావడంతో ఇప్పుడు పార్ట్ 2 తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించినా ఇప్పటి వరకు సెట్స్ మీదకు వెళ్లనే లేదు.

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.ఈ సినిమా ఈ ఏడాది జనవరిలో రిలీజ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 1000 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది.ఇక తారక్ ఈ సినిమా తర్వాత కొరటాల శివతో ఒక సినిమా ప్రకటించాడు.
జులై, ఆగష్టు అంటూ చెబుతున్నారు.కానీ ఇంత వరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు.
ఇలా ఈ ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ కూడా షూటింగులు లేకుండా ఖాళీగా ఉంటున్నారు.మరి సెట్స్ లోకి ఎప్పుడు అడుగు పెడతారో వేచి చూడాల్సిందే.