ప్రస్తుతం టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది.ప్రతిఒక్కరూ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు.
స్మార్ట్ వస్తువులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.ఇంట్లోని వస్తువులతో పాటు శరీరంపై ధరించే వస్తువులను కూడా స్మార్ట్ టెక్నాలజీ వాటినే వాడుతున్నారు.
స్మార్ట్ ఏసీ, స్మార్ట్ వాచ్, స్మార్ట్ ఫోర్.ఇలా ప్రతీది స్మార్ట్ దే ఉపయోగిస్తున్నారు.ఒకప్పుడు స్మార్ట్ వాచ్ లు చాలా తక్కువమంది ఉపయోగించారు.మాములు వాచ్ లే ఉండేవి.స్మార్ట్ వాచ్ ల గురించి చాలామందికి తెలిసేది కాదు.తెలిసినా స్మార్ట్ ఫోన్ ధరలు చాలా ఎక్కువగా ఉండేవి.
దీంతో చాలా తక్కువమంది మాత్రమే స్మార్ట్ వాచ్ లు వినియోగించేవారు.
అయితే ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది.
టెక్నాలజీని వాడుకునేవారి సంఖ్య పెరిగిపోయింది.దీంతో స్మార్ట్ వాచ్ లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
ఎవరి చేతికి చూసినా స్మార్ట్ వాచ్ లే ఎక్కువగా కనిపిస్తున్నాయి.తాజాగా మరో రెండు స్మార్ట్ వాచ్ లు భారత మార్కెట్ లోకి వచ్చాయి.
పెబల్ ఒరియ్, స్పెక్టా అనే రెండు వాచ్ లు వచ్చాయి.ఈ రెండింటికి బ్లూతూట్ కాలింగ్ ఆప్షన్ ఉంది.
పెబల్ ఒరియన్ మోడల్ వాచ్ 1.81 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే కలిగి ఉంది.ఏఐ ఎనేబుల్డ్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్, స్పోర్ట్స్ మానిటరింగ్, రక్తపోటు, హార్ట్ బీట్, స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య ట్రాకింగ్ లను కలిగి ఉన్నాయి.పెబల్ ఓరియన్ స్మార్ట్ వాచ్ ధర రూ.3,499గా ఉంది.ఇక పెబల్ స్పెక్టా ధర రూ.5,499గా ఉంది.

పెబల్ ఓరియన్ స్పెసిఫికేషన్ 240*286 పిక్సెల రిజల్యూషన్ తో 1.81 అంగుళాల స్కేర్ డిస్ ప్లేతో వస్తుంది, స్క్వేర్ ఆకారంలో ఉండే జింక్ బాడీని అందిస్తున్నారు.అలాగే హార్ట్ బీటింగ్ రేట్ మానిటరింగ్ సెన్సార్ తో పాటుగా SpO2 హెల్త్ ట్రాకర్ సదుపాయాన్ని కలిగి ఉంది.
అలాగే స్లీప్ మానిటరింగ్ ఫీచర్ ను కలిగి ఉంది.ఈ వాచ్ 100కు పైగా స్పోర్ట్స్ మోడ్ లను కలిగి ఉంది.స్ట్రెస్ మానిటరింగ్, స్టెప్స్ ట్రాకింగ్ ఫీచర్ లను కలిగి ఉంది.అలాగే ఆటో స్పీకర్ క్లీనర్ ఫీచర్ ను కలిగి ఉంది.







