మంజుల. ఒకప్పుడు తన అందచందాలతో తెలుగు జనాలను ఊర్రూతలు ఊగించిన నటీమణి.తన లేలేత అందాలతో తమిళ జనాలనూ అలరించింది.తెలుగులో ఆ నాటి టాప్ హీరోలు అయిన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు సహా పలువురితో కలిసి యాక్ట్ చేసింది.
అయితే ఈ ముద్దుగుమ్మను హీరోయిన్ పరిచయం చేసిన సినిమా ఎంజీఆర్ నటించిన రిక్షాకారన్ మూవీ.తమిళ సినిమా రంగంలో అప్పటికే తిరుగులేని కథానాయకుడిగా కొనసాగుతున్నాడు ఎంజీఆర్.ఆయన సినిమా ద్వారానే ఆబె తొలిసారి హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయ్యింది.
ఓ పత్రిక ముఖచిత్రం కోసం మద్రాసులోని విజయ గార్డెన్ లో ప్రముఖ ఫోటోగ్రాఫర్ భక్త ఆమె స్టిల్స్ తీస్తున్నాడు.
అక్కడే ఎంజీఆర్ సినిమా షూటింగ్ జరుగుతుంది.అక్కడే తను తొలిసారి మంజులను చూశాడు.
ఆమెను రమ్మని తన మేకప్ మెన్ కు చెప్పాడు.ఆయన మంజుల దగ్గరికి వచ్చి విషయం చెప్పాడు.
తొలిసారి స్టిల్స్ కోసం చీర కట్టుకున్న మంజుల.తన పైట జారిపోతున్నా పట్టించుకోకుండా సంతోషంతో ఆయన దగ్గరికి పరిగెత్తింది.ఆయాస పడుతూ వెళ్లి ఆయన ముందు నిల్చింది.ఆమెను చూసిన ఎంజీఆర్. ముందు చీర సరిగా వేసుకో అని చెప్పాడు.తనను తొలిసారి చూసిన మంజుల ఎంతో సంతోష పడింది.

మంజులతో మాట్లాడిన ఎంజీఆర్.ముందు మీ అమ్మను రమ్మని చెప్పు మాట్లాడుదాం అన్నాడు.ఆ తర్వాత మంజుల తల్లితో మాట్లాడాడు.తన బ్యానర్ లో హీరోయిన్ గా పనిచేసేందుకు ఐదు సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకున్నాడు.ఆ తర్వాత రిక్షా కారన్ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చాడు.ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.
ఎంజీఆర్ లాంటి హీరోతో నటించడంతో తనకు ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయి.అనతి కాలంలోనే మంజుల అగ్రతారగా ఎదిగింది.
ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ గా ఎదిగింది.తెలుగు సినిమా పరిశ్రమలోనూ గొప్ప హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.