బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ గురించి మనందరికీ తెలిసిందే.బాలీవుడ్ సినిమాలలో ఎన్నో విలక్షణమైన పాత్రలలో నటించి స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.
పాజిటివ్ నెగిటివ్ అని తేడా లేకుండా అన్ని రకాల పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు నవాజుద్దీన్ సిద్ధిఖీ.అలాగే సినిమా హిట్ ఫ్లాప్ అని సంబంధం లేకుండా వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నాడు.
కాగా నవాజుద్దీన్, థాక్‌రే, మాంటో, గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్, భజరంగీ భాయిజాన్, బదలాపూర్, మాన్‌సూన్ షూట్ అవుట్ లాంటి సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇది ఇలా ఉంటే తాజాగా నవాజుద్ధీన్ భార్య ఆలియా అతని పై కేసు నమోదైంది.
కాగా నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రస్తుతం హోలీ కౌ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాకి నవాజుద్దీన్ సతీమణి ఆలియా సిద్దిఖీ నిర్మాతగా వ్యవహరిస్తోంది.అయితే ఆలియా మంజు అగర్వాల్ అనే యువతి నుంచి రూ.31 లక్షలను అప్పుగా తీసుకుందని, తర్వాత అడిగితే సరిగ్గా స్పందింట్లేదని తెలుస్తోంది.దీంతో జూన్ 20న అంబోలి పోలీస్ స్టేషన్‌లో మంజు అగర్వాల్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.ఈ సందర్భంగా మంచి అగర్వాల్ మాట్లాడుతూ.ఆలియాకూ తనకు 2005 నుంచి పరిచయముందని,వారిద్దరు మంచి స్నేహితులు అయితే ఆమె చాలా కాలం నుంచి నిర్మాతగా మారాలని ఎదురుచూస్తోందట.
![Telugu Aaliya Siddiqui, Filed, Holy Cow, Manju Agarwal, Complaint, Rs Dues-Movie Telugu Aaliya Siddiqui, Filed, Holy Cow, Manju Agarwal, Complaint, Rs Dues-Movie](https://telugustop.com/wp-content/uploads/2022/07/police-complaint-on-nawazuddin-siddiqui-wife-aaliya-siddiqui-detailss.jpg )
ఇక అయితే ఈ సినిమాకు సంబంధించిన క్రియేటివ్ పనులు చూసుకోమ్మని, ఆర్థిక విషయాలను ఆమె చూసుకుంటానని చెప్పిందట.దీంతో సంజూ నటీనటుల విషయాలను నేను చూసుకున్నాను.కానీ వారికి చెల్లించాల్సిన చెక్కులు కొంతకాలానికే బౌన్స్ అయ్యాయి.
దీంతో ఆలియాకు కొంచెం డబ్బులు అవసరం కావడంతో మా నాన్నను అడిగి ఉజ్జయినిలోని ఓ ఇంటిని అమ్మి ఆమెకు డబ్బు ఇచ్చారు మా నాన్న.నెల రోజుల్లోనే తిరిగి ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు.
ఎన్నిసార్లు అడిగినా ఆమె డబ్బు తిరిగి ఇవ్వలేదు అని తెలిపింది మంజు అగర్వాల్.
.