1.భారతీయులపై వీసా ఆంక్షలు ఎత్తివేసిన చైనా

గత రెండేళ్లుగా వీసా మంజూరుపై విధించిన ఆంక్షలను చైనా ఎత్తివేసింది.ఈ నేపథ్యంలో స్వదేశంలోనే ఉండిపోవాల్సి వచ్చిన చాలామంది భారతీయ వృత్తి నిపుణులు , వారి కుటుంబ సభ్యులకు మేలు జరగనుంది.చైనా కాలేజీలు విశ్వవిద్యాలయాల్లో తిరిగి చేరడానికి ఆసక్తి చూపుతున్న వేలాది మంది భారతీయ విద్యార్థుల వినతులను కూడా పరిశీలించనుంది.
2.అమెరికా లో ఉత్తమ రెస్టారెంట్ గా భారతీయ ‘చాయ్ పాని
‘

అమెరికాలోని భారతీయ రెస్టారెంట్ కు ఉత్తమ రెస్టారెంట్ గా అమెరికా ఎంపిక చేసింది. అమెరికాలోని భారతీయులు ఏర్పాటుచేసిన ‘ చాయ్ పానీ ‘ స్ట్రీట్ ఫుడ్ రెస్టారెంట్ ఉత్తమ రెస్టారెంట్ గా ఎంపిక అయ్యింది.
3.మంకీ పాక్స్ వైరస్ పేరు మార్చిన డబ్ల్యూహెచ్ వో

ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలకు పైగా విస్తరించిన మంకీ ఫాక్స్ వైరస్ పేరును డబ్ల్యూహెచ్ఓ మర్చనున్నట్టు ప్రకటించింది.
4.భారత గోధుమల పై యూఏఈ నాలుగు నెలల నిషేధం

భారతదేశం నుండి గోధుములు , గోధుమపిండి ఎగుమతులను నాలుగు నెలల పాటు నిలిపివేయాలని యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
5. న్యూజెర్సీలో ‘ ఆటా ‘ నృత్య పోటీలు
అమెరికా తెలుగు అసోసియేషన్ ( ఆటా ) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 17 వ మహా సభలు ఘనంగా జరుగుతున్నాయి.ఈ మహా సభలలో భాగంగా న్యూస్ జెర్సీ లో ఆటా సయ్యంది పాదం నృత్య పోటీలను భారీ స్థాయిలో నిర్వహించారు.
6.క్షీణించిన పుతిన్ ఆరోగ్యం అంటూ.
.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం పై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.తాజాగా పుతిన్ విదేశాల్లో ఉంటే మలమూత్రాదుల ను సైతం మాస్కో లోనే పడేసే లా ఒక బాడీ గార్డ్ ను పెట్టుకున్నట్టుగా ఫాక్స్ న్యూస్ సంచలన కథనాన్ని ప్రచురించింది.
7.స్వచ్ఛంద సంస్థ కు వారెన్ బఫెట్ భారీ విరాళం
ప్రపంచంలోనే ఐదవ సంపన్నుడైన వారెన్ బఫెట్ తన నికర విలువ మొత్తాన్ని దాదాపు విరాళంగా అందిస్తానని గతంలో ప్రకటించినట్టుగానే నేడు బఫెట్ బిల్ – మొలిండా గేట్స్ ఫౌండేషన్ ట్రస్ట్ మరియు నాలుగు కుటుంబ స్వచ్ఛంద సంస్థలకు సుమారు నాలుగు బిలియన్లు ( 400 కోట్లు ) విరాళంగా ఇచ్చారు.
8.ముషారఫ్ ఆరోగ్య పరిస్థితి విషమం
ప్రస్తుతం 80 టెడ్ అరబ్ ఎమిరేట్స్ లో చికిత్స పొందుతున్న పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ పాకిస్థాన్కు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పాక్ మీడియా లో కథనాలు వెలువడుతున్నాయి.
9.భారత్ కు త్వరలో విమాన సర్వీసులు : శ్రీలంక
త్వరలోనే భారత్ కు శ్రీలంక నుంచి విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్టు శ్రీలంక ప్రకటించింది.
.