వైరల్ వీడియో: అతడి పెయింటింగ్ టాలెంట్ కు నేటిజన్లు ఫిదా..!

ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ అనేది దాగి ఉంటుంది.ఎందుకంటే కళ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు.

 Viral Video Netizens Pay Homage To His Painting Talent ,viral Latest, News Viral-TeluguStop.com

కొన్ని కొన్ని సార్లు సందర్భం వచ్చినప్పుడు మాత్రమే వాళ్లలో ఉన్న టాలెంట్ ఏంటి అనేది తెలుస్తుంది.వాళ్లకు ఉన్న టాలెంట్ తో ఎన్నో అద్భుతాలను సృష్టిస్తారు.

మనం ఇప్పటిదాకా ఎన్నో అద్భుతమైన కళాకండాలను చూసే ఉంటాము.వాటిని చూసినప్పుడు భలే అద్భుతంగా ఉన్నాయే అని అనిపిస్తుంది కదా.ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటి వీడియో ఒకటి వైరల్ గా మారింది.ఆ వీడియోను చూసి నెటిజన్స్ సైతం వావ్ అని అనకుండా ఉండలేకపోతున్నారు.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఒక లుక్ వేద్దాం.

మనం ఇప్పటిదాకా ఎన్నో అద్భుతమైన పెయింటింగ్‌ లను చూసి ఉంటాము.

కొన్ని పెయింటింగ్స్ చూస్తే అలా మనసులోనే ఉండిపోతాయి.సాధారణంగా పెయింటర్లు కాన్వాస్ మీదనో, తెల్లటి పేజీలోనో బొమ్మలను వేస్తూ ఉంటారు.

మరికొందరు మాత్రం తమ ప్రతిభను నలుగురుకు చాటి చెప్పడం కోసం రకరకాల పెయింటింగ్స్ వేస్తూ ఉంటారు.కానీ వీడియోలోని వ్యక్తి మాత్రం ఒక చిన్న సీసాలో ఎంతో సులభంగా అద్భుతమైన పెయింటింగ్‌ ను వేసేసాడు.

వీడియో ప్రకారం ముందుగా ఒక చిన్న గాజు సీసాను తీసుకున్నాడు.అది చూడడానికి ఒక నెయిల్ పాలిష్ సీసాలాగా అనిపిస్తుంది.

ఆ సీసా లోపల ఆ వ్యక్తి పెయింటింగ్ చేయడం ప్రారంభించాడు.అలా ఆ చిన్న సిసాలో ఒక అందమైన ప్రకృతికి సంబందించిన పెయింటింగ్ వేసాడు.ఎంతో ఈజీగా సీసాలో పెయింటింగ్ వేసేశాడు.వీడియోలోని వ్యక్తి పెయింటింగ్ వేసే తీరు చూస్తుంటే ఈ వ్యక్తికి ఎడమ చేయి వాటం ఉన్నట్టు తెలుస్తుంది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరు కూడా అతని టాలెంట్ ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube