జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఉత్సాహపడుతున్నారు .చాలా కాలంగా కేసీఆర్ చేస్తున్న రాజకీయం అంతా జాతీయ స్థాయిలోనే తిరుగుతోంది.
వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ నేతలను కలుస్తూ బీజేపీ వ్యతిరేక పార్టీలన్నిటినీ ఏకం చేసే పనిలో నిమగ్నమయ్యారు.బిజెపి, కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలు అన్నిటిని కలిపి ఒక ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేస్తారని అంతా భావించినా కేసీఆర్ మాత్రం జాతీయ పార్టీని ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఈ మేరకు జాతీయ పార్టీకి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.అంతకంటే ముందుగా అన్ని రాష్ట్రాలకు పార్టీ ఇన్చార్జి లను నియమించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఈ మేరకు ఒక్కో రాష్ట్రం నుంచి ఒక బలమైన నేపథ్యం ఉన్న వ్యక్తిని ఇంఛార్జిగా నియమించేందుకు కేసీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారు.వారికి జాతీయ స్థాయిలో గుర్తింపు లేకపోయినా, ఆయా రాష్ట్రాల్లో గుర్తింపు ఉంటే చాలు అన్న లెక్కల్లో కెసిఆర్ ఉన్నారు.
ఇప్పటికే ఏపీకి సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను, కర్ణాటకకు సినీ నటుడు ప్రకాష్ రాజ్ ను, తమిళనాడుకు విజయ్ ను ఇన్చార్జిలుగా నియమిస్తారని ప్రచారం జరుగుతున్నా, దీనిపై సైరైన క్లారిటీ లేదు.ఇప్పటికే ఉండవల్లి అరుణ్ కుమార్ తాను పూర్తిగా రాజకీయాలకు దూరం అయ్యానని, మళ్లీ యాక్టివ్ అయ్యే పరిస్థితి లేదని ఆయన క్లారిటీ ఇచ్చేశారు.
సినీ నటుడు ప్రకాష్ రాజ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు.ఇక సినీ నటుడు విజయ్ కు తమిళనాడులో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

ఆయన సొంతంగా పార్టీ పెడతారు తప్ప కేసీఆర్ స్థాపించబోయే జాతీయ పార్టీలో చేరే అవకాశం లేదనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.మిగతా రాష్ట్రాల్లోనూ ఆయా రాష్ట్రాల తరఫున కెసిఆర్ పార్టీ తరఫున యాక్టివ్ అయ్యే వారు అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో కెసిఆర్ స్థాపించబోయే జాతీయ పార్టీ ప్రభావం ఎంత వరకు ఉంటుంది అనేది ప్రశ్నగానే మారింది.ఇక బీజేపీ , కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తున్నా.మిగతా ప్రాంతీయ కెసిఆర్ స్థాపించబోయే కొత్త పార్టీకి ఎంతవరకు మద్దతుగా నిలబడతారు అనే దానిపైనే కొత్త జాతీయ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.